గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి.నవంబర్ 23 నుంచి పెళ్లిళ్లు మరింత పెరగనున్నాయి. రేపటి నుంచి డిసెంబర్ 15 వరకు దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్లు అంచనా వేస్తున్నారు. సుమారు ఈ సీజన్ మొత్తం మీద 38 లక్షలకు పైగా పెళ్లిళ్లు జరుగుతాయని సమాచారం.
38 లక్షలు అంటే మామూలు విషయం కాదు. పెళ్లి అంటే మాటలు కాదు.ఎంతో ఖర్చుతో కూడుకున్న పని . ఎవరి ఆర్థిక స్థోమతకు తగినట్లు వాళ్లు ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఎంత లేదు అనుకున్న ఒక మధ్య తరగతి పెళ్లికి వచ్చి 5 నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలా 38 లక్షల పెళ్లిళ్లు అంటే ఎన్ని కోట్ల వ్యాపారమో మాటల్లో చెప్పాలేం.
ఏకంగా రూ. 4.74 కోట్ల వ్యాపారం జరిగే అవకాశాలున్నట్లు వ్యాపారుల సమాఖ్య కాయిట్ అంచనా వేస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పెళ్లిళ్లు చాలా ఎక్కువని తెలుస్తుంది. పెళ్లిళ్లకు అవసరమైన వస్తువులు, వివిధ సేవల కోసం వినియోగదారులు సుమారు లక్ష కోట్లకు పైగా అదనంగా ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లో వివిధ వ్యాపార సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ఈ అంచనాకు వచ్చినట్లు కాయిట్ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్ వాల్ పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పెళ్లిళ్ల సంఖ్య కూడా భారీగా పెరగనుంది. పోయిన ఏడాది ఈ సమయంలో 32 లక్షలకు పైగా వివాహాలు జరగ్గా..ఆ సమయంలో రూ. 3.75 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందని ప్రవీణ్ తెలిపారు.
కానీ ఈ ఏడాది పెళ్లిళ్ల తో పాటు ఖర్చు కూడా భారీగా పెరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 19 న అత్యధిక సంఖ్యలో పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 23, 24, 27, 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 3,4,,7,8,9,15 తేదీల్లో వివాహ శుభ ఘడియలు అధికంగా ఉన్నాయి. కేవలం ఢిల్లీలోనే 4 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని, రూ.1.25 లక్షల కోట్ల వ్యాపారం ఇక్కడి జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.
Also read: టీ20లకు రోహిత్ శర్మ వీడ్కోలు పలికినట్లేనా? వన్డే కెప్టెన్సీ కూడా వదులుకుంటాడా?