UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి! యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహితను పంచాయతీ పెద్దలు చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండ వేశారు.ముఖానికి నల్లరంగు పూసి దారుణంగా ప్రవర్తించారు. By Bhavana 30 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Extramarital Affair In UP : యూపీ (Uttar Pradesh) లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా ప్రవర్తించారు. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో ముగ్గురు పిల్లల తల్లి అయిన వివాహితను చెట్టుకు కట్టేసి కొట్టారు. అక్కడితో ఆగకుండా ఆమె మెడలో చెప్పుల దండ వేశారు. మహిళ ముఖానికి పూర్తిగా నలుపు రంగు సిరా పూశారు. జుట్టు కత్తిరించారు. మైనర్‌లు అయిన ఆమె ముగ్గురు పిల్లల కళ్ల ముందే ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలి భర్త బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లాడు. మహిళ స్వగ్రామంలోనే ఉండి పిల్లలను చూసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం (Extramarital Affair) పెట్టుకోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఈ విషయం గురించి పంచాయతీ పెద్దల దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పంచాయతీ పెద్దలు ముంబైలో ఉన్న బాధితురాలి భర్తకు విషయం తెలియజేశారు. వెంటనే పంచాయతీకి రావాలని పిలిపించారు. భర్త, ముగ్గురు పిల్లల సమక్షంలో పంచాయతీ పెట్టారు. భర్త వివాహేతర సంబంధం నిజమేనని రుజువు చేశారు. ఆ పై ఆమెను చెట్టుకు కట్టేసి మెడలో చెప్పుల దండ వేయాలని, ముఖానికి నల్లరంగు పూయాలని, జుత్తు కత్తిరించాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. పంచాయతీ పెద్దల తీర్పు మేరకు గ్రామస్తులలో కొందరు బాధితురాలి ముగ్గురు పిల్లల ముందే ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. మెడలో చెప్పుల దండ వేశారు. ముఖానికి నల్లరంగు పూసి, జుత్తు కత్తించారు. కన్న పిల్లలు, కట్టుకున్న భర్త ముందే ఆమెను ఘోరంగా అవమానించారు. ఈ తతంగాన్నంతా గ్రామస్తుల్లో ఒకరు వీడియో తీశారు. ఈ వీడియోను దళిత్ వాయిస్ అనే పేరుతో ఉన్న ఎక్స్ (X) హ్యాండిల్లో పోస్టు చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Also read: విరిగిపడ్డ కొండ చరియలు.. ఏడుగురి మృతి..! #uttar-pradesh #crime #extramarital-affair మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి