Ayodhya: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన సమయంలోనే పిల్లల్ని కంటాం!

యూపీలో రామమందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగే జనవరి 22 నే చాలా మంది గర్భిణులు తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నారని అక్కడి వైద్యులు తెలిపారు. చాలా మంది సీ సెక్షన్‌ చేయాలని, మరి కొందరు నెలలు నిండకుండానే ప్రసవం చేయాలని వైద్యులను కోరుతున్నారని సమాచారం.

New Update
Ayodhya Ram Mandir: మీ ఇంటికే అయోధ్యారాముడి మహాప్రసాదం..ఇలా స్వీకరించండి..!!

Ayodhya Ram Mandir: దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్న అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన (Ayodhya) మహోత్సవానికి మరెన్నో రోజులు లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఉత్తర్‌ ప్రదేశ్ (Uttar Prdesh) లో అయితే ఈ వేడుకలు అంబరాన్నంటే విధంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో యూపీ వైద్యులకు (Doctors) రాష్ట్రానికి చెందిన గర్భిణీల (Pregnents) నుంచి అక్కడ వైద్యులకు ఓ కొత్త , వింతైన అభ్యర్థన వచ్చి పడింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం జరిగే రోజునే తమ బిడ్డలకు జన్మనివ్వాలనుకుంటున్నట్లు అక్కడి డాక్టర్స్‌ కు తెలిపారు. అందుకోసం వారు సీ సెక్షన్‌ చేయించుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఆరోజే జన్మనివ్వాలనుకుంటున్నాం..

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే రామ్‌ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు జరిగే జనవరి 22న తమ పిల్లలు పుట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. కొందరు అయితే నెలలు నిండినప్పటికీ కూడా తమ ప్రసవాలను జనవరి 22 వరకు వాయిదా వేయాలని వైద్యులను కోరుతున్నారు. మరి కొందరు అయితే నెలలు నిండకముందే బిడ్డలకు జన్మనివ్వాలని కోరుతున్నారు.

రామయ్య పేరు వచ్చేలా..

వారికి పుట్టే పిల్లలకు రాముడు పేరు వచ్చేలా పేర్లు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా 7000 మంది అతిథులకు ఆలయ ట్రస్టు ఆహ్వానాలను పంపింది. భారత ప్రధాని మోడీ తో పాటు ముఖ్యమంత్రులు, సినిమా స్టార్స్‌, స్పోర్ట్స్‌ స్టార్స్‌, సాధువులు ఈ వేడుకలకు హాజరవుతున్నారని సమాచారం.

అయోధ్యలో లక్షలాది మంది భక్తుల మధ్య అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి అధికారులు, ఆలయ ట్రస్టు వారు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈ భారీ వేడుకలకు యూపీ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికే చేసింది.

Also read: నా ఆరోగ్యం విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు!

Advertisment
Advertisment
తాజా కథనాలు