UP Crime: వికలాంగ మహిళను రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన మహిళా కానిస్టేబుళ్లు! జిల్లా ఎస్పీకి(dsp) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు (Conistables) ఈడ్చుకొంటూ తీసుకుని వెళ్లారు. ఎస్పీ(sp) కార్యాలయం నుంచి ఆమెను మరో పోలీస్ స్టేషన్ వరకు ఆమెను ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. By Bhavana 02 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి రోజురోజుకి దేశంలో మహిళల మీద జాలి లేకుండా పోతుంది. బాధ్యత గల పదవుల్లో ఉండి మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. అన్యాయాలను ఆరికట్టాల్సిన పోలీసులే ఒక వికలాంగ మహిళ పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. కనీసం వికలాంగురాలు అని కూడా చూడకుండా..రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్ (up)లో చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీకి(dsp) ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఓ వికలాంగ మహిళను ఇద్దరు మహిళ కానిస్టేబుళ్లు (Conistables) ఈడ్చుకొంటూ తీసుకుని వెళ్లారు. ఎస్పీ(sp) కార్యాలయం నుంచి ఆమెను మరో పోలీస్ స్టేషన్ వరకు ఆమెను ఈడ్చుకుంటూ లాక్కెళ్లారు. ఈ దారుణ ఘటనకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన గురించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేశవ్ చంద్ర గోస్వామి స్పందించారు. ఈ దారుణ ఘటన గురించి ఆయన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అసలేం జరిగిందంటే.. హర్దోయి జిల్లాలోని పిహానీ ప్రాంతానికి చెందిన ఓ వికలాంగ మహిళ శనివారం ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు ఇద్దరు ఆమెను కార్యాలయంలోనికి అనుమతించలేదు. అంతేకాకుండా వికలాంగురాలు అని కూడా చూడకుండా ఆమెను అక్కడ నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. వికలాంగురాలు అని కూడా చూడకుండా మహిళా కానిస్టేబుళ్లు అత్యంత కఠినంగా ప్రవర్తించడం అక్కడి వారిని షాక్ కి గురి చేసింది. భర్తతో విభేదాలు రావడంతో ఎస్పీ కి ఫిర్యాదు ఇచ్చేందుకు ఆమె కార్యాలయానికి రావడంతో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే మహిళను ఈ విషయం గురించి ప్రశ్నించగా..తాను ఫిర్యాదు ఇవ్వడానికి వస్తే అనుమతించకుండా ఇలా అమానవీయంగా ప్రవర్తించాని ఆమె తెలిపింది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎస్పీ కార్యాలయం గోడ దూకేందుకు ప్రయత్నించడంతో నే అలా ఆమెను ఈడ్చుకెళ్లామని తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎస్పీ వెల్లడించారు. #police #women #up మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి