/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-4.jpg)
UP Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హథ్రస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు వ్యాన్‌ను ఓవర్ టేక్ చేసే క్రమంలో బలంగా ఢీకొట్టింది. దీంతో 15 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో నలుగురు మహిళలు, చిన్నారులున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘోర ప్రమాదంపై ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.