బైక్‌ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు!

మధ్యప్రదేశ్ లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రికి స్వల్పంగా గాయాలు కాగా..ఓ ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

బైక్‌ ని ఢీకొట్టిన కేంద్ర మంత్రి కారు..ఉపాధ్యాయుడు మృతి, విద్యార్థులకు తీవ్ర గాయాలు!
New Update

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ ప్రయాణిస్తున్న కారు ఓ బైక్‌ ని ఢీకొట్టింది. దీంతో బండి మీద ప్రయాణిస్తున్న ఉపాధ్యాయుడు తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ప్రహ్లాద్‌ ఛింద్వారాలో ఓ ఎన్నికల కార్యక్రమాన్ని ముగించుకుని నర్సింగ్‌పూర్‌ కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సింగోడి బైపాస్‌ సమీపంలోని ప్రైవేట్‌ పాఠశాల నుంచి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయుడు బైక్‌ పై వస్తున్నాడు. ఆ సమయంలో మంత్రి కారు బైక్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఉపాధ్యాయునితో పాటు విద్యార్థులను కూడా మంత్రి స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చేర్పించారు.

Also read: ఖలిస్తాని బెదిరింపులు..ఆ ఎయిర్‌ పోర్టుల్లో భద్రత కట్టుదిట్టం!

ఉపాధ్యాయుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌ కి తరలించారు. ఈ ప్రమాదంలో మంత్రి కాలికి సైతం స్వల్ప గాయమైంది. ప్రమాదం జరిగిన అనంతరం నార్సింగ్‌పూర్‌కు మరో వాహనంలో వెళ్లిపోయారు.

అయితే, సంఘటనా స్థలంలో బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు.మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రిగా ఉన్న ప్రహ్లాద్ పటేల్ ఈసారి మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో పోటీ చేస్తున్నారు.

Also read: అంబులెన్స్‌ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు!

#minister #accident #madhyapradesh #prahladpatel
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe