Telangana: లిక్కర్ స్కామ్‌లో కవితను వదిలే ప్రసక్తే లేదు.. కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు.. కవితను ఎలా విడిచిపెడతాం అంటూ సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరని, ప్రతి ఒక్కరి నంబర్ వస్తుందన్నారు. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందేనని అన్నారు. By Shiva.K 04 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Union Minister Anurag Thakur: తెలంగాణ ఎన్నికలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ(Telangana) ఎన్నికల సందర్భంగా బీజేపీ(BJP) అధిష్టానం తనను బ్యాట్స్‌మెన్‌గా పంపించారని, అద్భుతమైన ప్రదర్శన చేస్తానని వ్యా్ఖ్యానించారు. శనివారం నాడు గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు. అనంతరం కత్రియ హోటల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో వరల్డ్ కప్ జరుగుతోందని, మన దేశ టీమ్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోందన్నారు. ఇదే మాదిరిగా.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా తనను బ్యాట్స్‌మెన్‌గా పంపించారన్నారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే వదల్లేదు.. కవితను ఎలా వదిలేస్తాం.. 'తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి చేస్తారని అనుకుంటే ఆయన కూడా నిరుద్యోగులను మోసం చేశారు. 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పార్టీ పేరు మార్చి దేశ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కేసీఆర్.. జాతీయ రాజకీయాలు చేద్దామనుకుంటే.. ఆయన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది. తెలంగాణలో ఎంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపారు. లిక్కర్ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే. కవిత పేరు ఢిల్లీ లిక్కర్ కేసులో ఉంది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతాం.' అని సంచలన కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. KCR और KTR का भ्रष्टाचार पार्टी का नाम बदल लेने से नहीं छुपेगा। तेलंगाना के लोगों का जोश दिखाता है, BRS के खिलाफ हवा है। यहां के लोग KCR के राज से तंग आ चुके हैं। लोग एक ईमानदार और विकास वाली सरकार चाहते हैं, जो केवल भाजपा दे सकती है। pic.twitter.com/edkrlwjLo8 — Anurag Thakur (@ianuragthakur) November 4, 2023 కాళేశ్వరంపై తీవ్ర ఆరోపణలు.. 'కేసీఆర్ గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. కాళేశ్వరం బిగ్గెస్ట్ ఇంజినీరింగ్ బ్లండర్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టు అయితే లక్ష కోట్ల కరప్షన్ ఎలా జరిగిందని మంత్రి కేటీఆర్ అంటున్నారు.. అంటే కరప్షన్ జరిగినట్లు అయితే ఒప్పుకున్నట్లే కదా. మరి ఎంత అవినీతి జరిగిందో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ ను అడిగి చెప్పాలి. కేసీఆర్ నీకు దమ్ముంటే నువ్ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా? దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, డబుల్ ఇండ్లు, ఇస్తామన్న ఉద్యోగాలు ఏమయ్యాయి?' అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. भाजपा ने हमेशा तेलंगाना के हक़ की लड़ाई लड़ी है। केंद्र से मोदी सरकार ने तेलंगाना को 9 लाख करोड़ रुपये विकासात्मक कार्यों के लिए दिये हैं। pic.twitter.com/pPqJFIiUAu — Anurag Thakur (@ianuragthakur) November 4, 2023 కాంగ్రెస్ పాలనపై విమర్శలు.. రాజస్థాన్‌లో గెహ్లాట్ సర్కార్ కాదు.. గెహ్ లూట్ సర్కార్ ఉందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంతో దోచుకుందని ఆరోపించారు అనురాగ్ ఠాకూర్. పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 'రాజస్థాన్ సచివాలయంలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికింది. విదేశాల నుంచి డబ్బులను ఎన్నికల కోసం తెప్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. మహాదేవ్ యాప్ పేరిట కాంగ్రెస్ అవకతవకలకు పాల్పడుతోంది. మహాదేవ్ యాప్ పేరుతో దేవుడి పేరును చెడగొట్టారు. మహాదేవ్ యాప్ పేరిట రూ. 508 కోట్లు ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భాగేల్‌కు అందాయి. కాంగ్రెస్ గ్యారెంటీలు వర్కవుట్ అవ్వడం లేదు. అబద్ధపు కాంగ్రెస్.. అబద్ధపు గ్యారెంటీలు. కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కోసం విదేశాలు, మహాదేవ్ యాప్, కర్ణాటక నుంచి తీసుకొస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ఆలస్యం చేయడం వల్ల ఎంతోమంది మరణించారు. పార్లమెంట్‌లో సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు ఎలా వ్యవహరించారో నాకు తెలుసు.' అని కాంగ్రెస్ తీరును తూర్పారబట్టారు. सट्टे के पैसे के दम पर सत्ता चाहती है कांग्रेस… pic.twitter.com/9Jan7wLMrM — Anurag Thakur (@ianuragthakur) November 4, 2023 Also Read: పొంగులేటి శ్రీనివాస్ ఆస్తి ఎంతో తెలుసా.. లెక్కలు చూస్తే కళ్లు తేలేస్తారు..! నల్లగొండలో కోమటిరెడ్డి వర్సెస్ కంచర్ల.. ఎవరి బలమెంతో తెలుసా? #telugu-news #mlc-kavitha #telangana-politics #union-minister-anurag-thakur #telangana-elections-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి