Telangana Elections: 'షా' ఆగమనం రేపే.. ఫుల్ షెడ్యూల్ ఇదే..!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం రాష్ట్రానికి క్యూ కట్టనుంది. ఇందులో భాగంగా.. తొలుత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో అధికారిక కార్యక్రమంతో పాటు.. పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నారు. అయితే, శుక్రవారం ఈ కార్యక్రమాలు ఉండగా.. గురువారం రాత్రే ఆయన హైదరాబాద్ కు పయనం అవుతున్నారు. ఢిల్లీ నుంచి గురువారం రాత్రి 10 గంటలకు బయలుదేరి తెలంగాణకు చేరుకుంటారు.

New Update
ఐదేళ్లలో నక్సలిజాన్ని ఖతం చేస్తాం.. అమిత్ షా

Home Minister Amit Shah: తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ(BJP) స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆ పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణకు వస్తున్నారు. గురువారం రాత్రే ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. అధికారిక కార్యక్రమాలతో పాటు.. పార్టీ కార్యక్రమాలకు హాజరవనున్నారు. అధికారి సమాచారం ప్రకారం.. అమిత్ షా టూర్ షెడ్యూల్ ఇలా ఉంది.

అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్..

☛ రేపు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు అమిత్ షా.

☛ 10 గంటల 20 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నేషనల్ పోలీస్ అకాడమిక్ చేరుకోనున్నారు అమిత్ షా.

☛ రాత్రికి పోలీస్ అకాడమీలో బస చేయనున్న అమిత్ షా

☛ మరుసటి రోజున అంటే 27వ తేదీన ఉదయం 8 గంటలకు నేషనల్ పోలీస్ అకాడమీలో పోలీస్ అమరవీరుల స్థూపానికి పుస్పగుచ్చాలతో శ్రద్దాంజలి ఘటించనున్నారు అమిత్ షా.

☛ అనంతరం 11 గంటల వరకు ఐపీఎస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొంటారు.

☛ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నేషనల్ పోలీస్ అకాడమీలో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఇదికూడా చదవండి: వాసివాడి తస్సాదియ్యా.. పొలిటికల్ పార్టీల పెండ్లి.. శుభలేఖ చూస్తే అవాక్కవ్వాల్సిందే..!

☛ మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం అనంతరం 2:35 గంటలకు రోడ్డు మార్గం ద్వారా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు అమిత్ షా.

☛ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో సూర్యపేటలో జరిగే బీజేపీ జన గర్జన సభకు వెళ్లనున్నారు.

☛ మధ్యాహ్నం 3:45 గంటలకు సూర్యాపేటకు చేరుకుంటారు.

☛ మధ్యాహ్నం 3:55 గంటలకు జన గర్జన సభాస్థలికి చేరుకుంటారు.

☛ 3:55గంటల నుంచి 4:45 వరకు జన గర్జన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

☛ సాయంత్రం 5:00 గంటలకు సూర్యాపేట నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు అమిత్ షా.

☛ 5:45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు అమిత్ షా.

☛ 5:50 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.

☛ 5:55 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి పయనం అవుతారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.

ఇదికూడా చదవండి: రూ.1000 నోట్లు మళ్లీ వినియోగంలోకి వస్తున్నాయా? ఈ ప్రచారంపై ఆర్బీఐ సమాధానం ఇదే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు