Union Budget 2024: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. బంగారం, వెండి, తోలు వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు చౌకగా మారనున్నాయి. టెలికం పరికరాల ధరలు మరింత పెరగనున్నాయి.

New Update
Union Budget 2024: మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం.. ధరల హెచ్చుతగ్గుల వివరాలివే!

Union Budget 2024: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్‌ను ప్రకటించగా.. క్యాన్సర్‌ ఔషధాలు, మొబైల్‌ ఫోన్లపై కస్టమ్స్‌ సుంకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు సీతారామన్‌ (Nirmala Sitharaman) ప్రకటించారు. దీంతో రిటైల్‌ మార్కెట్‌లో వీటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి. అలాగే బంగారం (Gold), వెండి, తోలుతో తయారు చేసిన వస్తువులు, సముద్రపు ఆహార పదార్థాలు కూడా చౌకగా మారనున్నాయి.

భారీగా తగ్గిన బంగారం, వెండి..
ఈ మేరకు ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి రూ. 67,600కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,730కి చేరుకుంది. హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.73,580కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 67,450కు చేరింది. ఇక వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు 400 రూపాయలు తగ్గాయి. దీంతో ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.91,100కు చేరుకుంది. బంగారం, వెండిలపై దిగుమతి సుంకాలను 6 శాతానికి తగ్గించారు.

ఇది కూడా చదవండి: Union Budget 2024: బడ్జెట్‌ కంటే అంబానీల పెండ్లి వీడియో చూడటం బెటర్.. అష్నీర్‌ గ్రోవర్‌ సెటైర్లు!

స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం..
మొబైల్‌ ఫోన్లు, మొబైల్‌ ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డులు (PCBA), ఛార్జర్లపై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని (BCD) తగ్గించడంతో వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈ చర్యను మేడిన్‌ ఇండియా మాన్యుఫాక్చరింగ్‌ రంగానికి శుభసూచికంగా పేర్కొంటున్నారు. గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్ల దేశీయ ఉత్పత్తి, ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. టెలికం పరికరాలు మదర్‌బోర్డులపై 5శాతం దిగుమతి సుంకాన్ని పెంచాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

నిన్న సెన్సెక్స్ 80,502.08 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ బెంచ్‌మార్క్ 23,537.85 వద్ద ముగిసింది. మధ్యతరగతి వర్గాలకు పన్ను రాయితీలు, ఉద్యోగాల కల్పన చర్యలు మార్కెట్లకు మాంచి ఊపు ఇచ్చే అవకాశం ఉంది. అమ్మోనియం నైట్రేట్‌పై 10 శాతం, బయోడిగ్రేడబుల్ సాధ్యంకాని ప్లాస్టిక్‌పై 25 శాతం మేర కస్టమ్స్ సుంకాన్ని పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇది కూడా చదవండి: బడ్జెట్‌లో జనగణనకు తక్కువ కేటాయింపులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు