Anakapalli: అనకాపల్లి రాజకీయంలో అనూహ్య మార్పు..

అనకాపల్లి రాజకీయంలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. మొన్నటి వరకు తనకే సీట్ కేటాయించాలని మొండి చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు.. ఈ రోజు తన పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణను ఆహ్వానించారు. అధిష్టానం నిర్ణయమే మనకు ముఖ్యమని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

New Update
Anakapalli: అనకాపల్లి రాజకీయంలో అనూహ్య మార్పు..

Anakapalli Politics: టీడీపీ జనసేన కూటమి తొలి జాబితాలో చోటు దక్కని టీడీపీ నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సీటు దక్కకపోతే రాజీనామా చేస్తామంటూ కొందరూ హెచ్చరించారు. అయితే, మరికొందరూ మాత్రం టికెట్ దక్కకపోయినా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని సైలెంట్ గా ఉండిపోతున్నారు. తాజాగా, అనకాపల్లి టీడీపీలో నెలకొన్న అసంతృప్తి సద్ధుమణిగినట్టు కనిపిస్తోంది.

Also Read: కొత్త పెళ్లి కూతుర్లూ.. ఇది మీ కోసమే.. అత్తమామలను ఫ్లాట్‌ చేసే చిట్కాలు!

పొత్తులో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ కు టికెట్ కేటాయించారు. దీంతో టీడీపీ పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ సత్యనారాయణ ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పార్టీ అధినాయకత్వ తీరును తీవ్రంగా ఖండించారు. పార్టీని వీడాలంటూ పలువురు కార్యకర్తలు గోవింద్‌కు సూచించారు. ఆ దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.

వైసీపీ నుంచి అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఈ ఊహాగానాలకు చెక్‌ చెప్పేలా పీలా గోవింద్‌ సత్యనారాయణ స్పందించిన విషయం తెలిసిందే. తన నివాసం వద్ద కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇదే ఇంటిలో.. ఇదే పార్టీలో.. ఇదే కుటుంబంతో ఉంటానని స్పష్టం చేయడంతో పార్టీలో మారుతున్నట్టు వస్తున్న ఊహాగానాలకు తెరదించారు.

Also Read: వైసీపీలోకి భూమా ఫ్యామిలీ.. భూమా అఖిలప్రియ Vs కిషోర్‌రెడ్డి

కాగా, మొన్నటి వరకు తనకే సీట్ కేటాయించాలని మొండి చేసిన పీలా గోవిందు.. ఈ రోజు తన పార్టీ కార్యాలయానికి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ ను ఆహ్వానించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అధిష్టానం నిర్ణయం మనకు ముఖ్యమని పేర్కొన్నారు. భవిష్యత్తు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో సుమారు గంటపాటు చర్చించుకున్నారు. ఇలా అనకాపల్లి జిల్లా రాజకీయంలో అనూహ్య మార్పు చోటుచేసుకుంది.

Advertisment
తాజా కథనాలు