Under Water Metro : నదికిందుగా మెట్రో.. ఇప్పటి మాట కాదు.. వందేళ్ల క్రితంది!

దేశంలో నీటి అడుగున తొలి రైలు మార్గంగా రికార్డు సృష్టించిన కోల్‌కతాలో అండర్‌వాటర్‌ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. కానీ, నూరేళ్ళ క్రితమే బ్రిటిష్ ప్రభుత్వం ఈ రైలు మార్గం నిర్మించాలని చూసింది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోండి. 

New Update
Under Water Metro : నదికిందుగా మెట్రో.. ఇప్పటి మాట కాదు.. వందేళ్ల క్రితంది!

Under Water Metro : ప్రధాని మోదీ(PM Modi) ఇటీవల కోల్‌కతా(Kolkata) లో అండర్‌వాటర్‌ మెట్రో ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున రైలు పరుగులు తీసే దృశ్యం తలుచుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది కదా. మన దేశ టెక్నాలజీ పవర్ గురించి గర్వంగానూ అనిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ నిన్నా.. మొన్నటిది కాదు అనే విషయం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. నిజం.. ఇది నూరేళ్ళ క్రితం నాటి కల. కోల్‌కతాలో అండర్‌వాటర్‌ మెట్రో నిర్మాణం కోసం శతాబ్దం కిందటే ఆలోచనలు.. ప్రణాళికలు.. సర్వేలు జరిగాయి. కానీ, కొన్ని కారణాలవలన ఈ ప్రాజెక్ట్(Under Water Metro) అప్పట్లో సాధ్యం కాలేదు. అసలు ఏమిటీ శతాబ్దంనాటి కల. ఎవరు ఈ ప్లాన్ చేశారు? ఎందుకు అది ఆగిపోయింది ఇప్పుడు తెలుసుకుందాం. 

అప్పట్లో అంటే, 1921 సంవత్సరం ప్రాంతంలో లండన్(London) లోని థేమ్స్ నది కిందుగా ట్యూబ్ రైలు మార్గం నిర్మాణం చేయడానికి ప్లాన్ చేశారు. అదే సమయంలో బ్రిటిష్ పాలకులు ఇక్కడ కూడా హూగ్లీ మీదుగా తూర్పు-పశ్చిమ మెట్రో ప్రాజెక్టును తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఇక్కడ బెంగాల్‌లో పుట్టి పెరిగిన సర్‌ హార్లే డాల్రింపుల్‌ హే ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేశారు. ప్లాన్‌లో 10 స్టాప్‌లు, నది అడుగున 10.6168 కిలోమీటర్ల ట్రాక్‌ ఉండాలని చూశారు. కోల్‌కతాలో మట్టి పరీక్ష తర్వాత, బ్రిటిష్ అధికారులు ఈ(Under Water Metro) ఆలోచనను విరమించుకున్నారు. ఎందుకంటే,  ప్రాజెక్ట్ వ్యయం వారు లండన్‌లో నిర్మించిన దాని కంటే ఆరు రెట్లు ఎక్కువ కావడమే. అలా వందేళ్ల క్రితం నాటి ప్లాన్ ఇప్పటికి సాధ్యం అయింది. 

ఇప్పుడు కూడా అది అంత తేలికగా ఏమీ సాధ్యం కాలేదు. ఎన్నో ఇబ్బందులను దాటుకుంటూ..(Under Water Metro) దీని నిర్మాణం సాగింది. ఈ ప్రాజెక్ట్ ప్రాంతం సముద్రం-నది కలిసే చోటులో ఉంది. దీంతో అక్కడి నేల చాలా మెత్తగా ఉండడంతో ప్రాజెక్ట్ నిర్మాణ ప్లాన్ జాగ్రత్తగా రూపొందించారు. ఆగస్టు 31, 2019న సెంట్రల్ కోల్‌కతాలోని బౌబజార్‌లో మెట్రో టన్నెల్ నిర్మాణ సమయంలో నేల కూలడం, అనేక భవనాలు కూలిపోవడంతో తూర్పు-పశ్చిమ విభాగంలో మొత్తం విస్తరణలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడంలో జాప్యం జరిగింది.

Also Read : ప్రపంచంలోనే మొదటి CNG బైక్‌ మన దేశం నుంచే.. ఏ కంపెనీ తెస్తోందంటే.. 

నీటి కింద మెట్రో ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఇదే.. 

హౌరా మైదాన్ మెట్రో స్టేషన్భా(Under Water Metro) రతదేశంలో లోతైన మెట్రో స్టేషన్. హౌరా మైదాన్ - ఎస్ప్లానేడ్ మధ్య ఉన్న 4.8 కి.మీ విస్తీర్ణం హౌరా మైదాన్ - ఐటి హబ్ సాల్ట్ లేక్ సెక్టార్ V మధ్య ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్‌లోని రెండవ విభాగం ఉంది. ఎస్ప్లానేడ్-సీల్దా విభాగం తూర్పు-పశ్చిమ విభాగం పూర్తి కావలసి ఉంది. 

ప్రస్తుత ఈస్ట్-వెస్ట్ మెట్రో కింద, సాల్ట్ లేక్ సెక్టార్ V నుండి సీల్దా వరకు సర్వీసులు నడుస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ మెట్రో మొత్తం 16.6 కి.మీ పొడవులో, హౌరా మైదాన్, ఫూల్‌బగన్ మధ్య భూగర్భ కారిడార్ 10.8 కి.మీ. ఇందులో హుగ్లీ నది కింద సొరంగం కూడా ఉంది. మిగిలిన భాగం ఎలివేటెడ్ కారిడార్.

Advertisment
Advertisment
తాజా కథనాలు