CNG Bike: ప్రపంచంలోనే మొదటి CNG బైక్ మన దేశం నుంచే.. ఏ కంపెనీ తెస్తోందంటే.. ఇప్పటివరకూ CNGతో నడిచే బైక్ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు బజాజ్ కంపెనీ CNG బైక్ తీసుకురాబోతోంది. ఈ ఏప్రిల్-జూన్ మధ్యలో బజాజ్ ఆటో సిఎన్జి బైక్‌ను విడుదల చేయనుంది. CNG బైక్ తో ఇంధన నిర్వహణ ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని కంపెనీ చెబుతోంది. By KVD Varma 07 Mar 2024 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bajaj Auto - World's First CNG Bike: భారతీయ కంపెనీ బజాజ్ ఆటో త్వరలో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను విడుదల చేయబోతోంది. వచ్చే త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో బజాజ్ ఆటో సిఎన్జి బైక్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండి రాజీవ్ బజాజ్ (Rajiv Bajaj) ప్రకటించారు. సిఎన్జి బైక్‌తో ఇంధన ధర సగానికి తగ్గుతుందని రాజీవ్ బజాజ్ చెప్పారు. ఆయన చెబుతున్నదాని ప్రకారం CNG బైక్ వలన బైక్ ఇంధన ధర నిర్వహణ వ్యయం 50-65 శాతం తగ్గుతుంది. అంటే సగానికి సగం ఖర్చు వినియోగదారునికి తగ్గిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. ఇప్పుడు ఒక బైక్ 60 కిలోమీటర్లకు లీటరు పెట్రోల్ వినియోగిస్తుంది అనుకుందాం. అప్పుడు ఖర్చు ఇప్పటి పెట్రోల్ రేట్ ప్రకారం 110 రూపాయల వరకూ ఉంటుంది. అదే CNG బైక్ తో 50-60 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అలాగే, పెట్రోల్-డీజిల్ రన్నింగ్ వెహికల్స్ (ICE వాహనాలు)తో పోలిస్తే CNG బైక్‌లు తక్కువ కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంటాయని రాజీవ్ బజాజ్ వెల్లడించారు. CNG ప్రోటోటైప్‌లో కార్బన్ డయాక్సైడ్‌లో 50 శాతం తగ్గింపు గమనించినట్లు ఆయన తెలిపారు. ఇది కాకుండా, కార్బన్ మోనాక్సైడ్లో 75 శాతం తగ్గింపు అలాగే, మీథేన్ కాని హైడ్రోకార్బన్ ఉద్గారాలలో 90 శాతం తగ్గింపు కూడా ఉందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి.. బజాజ్ ఆటో (Bajaj Auto) కూడా ఎలక్ట్రిక్ బైక్‌లపై పెట్టుబడులను పెంచుతోంది. ఎలక్ట్రిక్ బైక్ షేరింగ్ ప్లాట్‌ఫామ్ యులు బైక్స్‌లో కంపెనీ తన వాటాను కూడా పెంచుకుంది. యులు బైక్స్‌లో రూ.45.75 కోట్ల అదనపు పెట్టుబడి పెట్టడం ద్వారా బజాజ్ కంపెనీలో తన వాటాను 18.8 శాతానికి పెంచుకుంది. బజాజ్ ఆటో 2019 సంవత్సరంలో యులు బైక్‌లలో సుమారు రూ.66 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. Also Read: అప్పటికల్లా మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : క్రిసిల్ అతిపెద్ద పల్సర్.. బజాజ్ ఆటో 2025 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025) ఇప్పటి వరకు అతిపెద్ద పల్సర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 125 సిసి కంటే ఎక్కువ ఉన్న సెగ్మెంట్‌పై దృష్టి సారించినట్లు కంపెనీ తెలిపింది. ప్రీమియమైజేషన్‌కు బదులుగా పల్సర్ వంటి బ్రాండ్లకు సూపర్ సెగ్మెంటేషన్పై దృష్టి సారిస్తోందని బజాజ్ తెలిపింది. Watch this Video about Bajaj CNG Bike: #automobile #bikes #cng-bike #bajaj-auto మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి