BYJU'S : ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ను కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఇటీవల రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించిన ఈ సంస్థ...కాలంలో ఉద్యోగాలకు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఉంది. కొంతమంది పెట్టుబడిదారులతో న్యాయపరమైన వివాదం కారణంగా రైట్స్ ఇష్యూ నిధులు ప్రత్యేక ఖాతాలో లాక్ కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రవీంద్రన్ పేర్కొన్నారు. నెల క్రితం జారీ చేసిన హక్కుల ఇష్యూ విజయవంతంగా పూర్తయిందని రవీంద్రన్ ఉద్యోగులకు రాసిన లేఖలో తెలిపారు. ఇది సంతోషకరమైన పరిణామంగా మేము భావించాము ఎందుకంటే మా స్వల్పకాలిక అవసరాలను తీర్చడానికిచ బాధ్యతలను తిరిగి చెల్లించడానికి ఇప్పుడు తమ వద్ద ఇప్పుడు డబ్బు ఉందని లేఖలో పేర్కొన్నారు.
అయితే తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడం బాధాకరంగా ఉందన్నారు. రవీంద్రన్ ఉద్యోగులకు రాసిన లేఖలో..మార్చి 10వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. చట్ట ప్రకారం అనుమతిస్తేనే చెల్లింపులు జరపగలుగుతామని చెప్పారు. గత నెలలో సరిపడా నిధులు లేకపోవడంతో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఇప్పుడు నిధులు ఉన్నప్పటికీ ఆలస్యమవుతున్నామని రవీంద్రన్ అన్నారు.
దురదృష్టవశాత్తూ,కొంతమంది పెట్టుబడిదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించుకున్నప్పటికీ..వారి మూలంగా ఉద్యోగులు పడిన కష్టానికి జీతాలు చెల్లించలేనిపరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు ఇన్వెస్టర్లు బైజూస్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా గణనీయమైన లాభాలను పొందారన్నారు. అందులో ఒకరు పెట్టిన పెట్టుబడికి ఏకంగా 8 రెట్లు అర్జించిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. అలాంటివారు ఇతరుల జీతాలు, జీవనోసాధితో ఇప్పుడు గేమ్స్ ఆడుతున్నారంటూ రవీంద్రన్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘మోదీ హామీ అంటే నెరవేరే హామీ’ బెగుసరాయ్‌లో గత ప్రభుత్వాల దుమ్ముదులిపిన ప్రధాని.!
తమ హక్కుల సాధన కోసం న్యాయపరంగా తీవ్రంగా క్రుషి చేస్తున్నామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా...ప్రస్తుతానికి మీకు ఆర్థిక సహకారం అందించలేకపోతున్నా అనేది వాస్తవమన్నారు. ఈమధ్యే బైజూస్ సంస్థ 200 మిలియన్ డాలర్ల నిధులను రైట్ ద్వారా సమీకరించింది. కొందరు పెట్టుబడిదారులు బైజూస్ పై నేషన్ కంపెనీలా ట్రెబ్యూనల్ ను ఆశ్రయించారు. దీంతో ఆ మొత్తం కూడా ఎస్క్రో అకౌంట్లోనే ఉంచాలని బైజూస్ కు సూచించింది. దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా పడింది.