Landslide : మాటలకందని విషాదం.. 670 మంది మృతి.. కొండచరియలు విరిగిపడడంతో..

పసిఫిక్‌ ద్వీప దేశమైన పపువా గినిలోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్ సంస్థ అంచనా వేసింది.

Landslide : మాటలకందని విషాదం.. 670 మంది మృతి.. కొండచరియలు విరిగిపడడంతో..
New Update

Un Migration Agency : పసిఫిక్‌ ద్వీప దేశమైన పపువా గిని (Papua New Guinea) లోని ఓ మారుమూల గ్రామంలో కొండచరియలు (Landslides) విరిగిపడి భారీ ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 670 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ ఫర్ మైగ్రేషన్ (IOM) సంస్థ అంచనా వేసింది. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని యూఎన్‌ మైగ్రేషన్ ఏజెన్సీ మిషన్ చీఫ్‌ సెర్హన్ అక్టోప్రాక్ (Serhan Actoprak) అన్నారు.

Also read: ఇజ్రాయెల్‌కు త్వరలో సర్‌ప్రైజ్‌అంటూ హెజ్‌బుల్లా గ్రూప్ హెచ్చరిక

ఇంతకు ముందు అక్కడి స్థానిక అధికారులు 100 మందికి పైగా చనిపోయారని చెప్పారు. కానీ ఇప్పుడు మృతుల సంఖ్య 670 దాటి ఉంటుందని అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం నాటికి కేవలం ఐదు మృతదేహాలు, ఆరో మృతదేహానికి సంబంధించిన ఓ కాలును మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Also read: వాట్సాప్‌ను టార్గెట్‌ చేసిన ఎలాన్‌ మస్క్.. కంపెనీపై సంచలన ఆరోపణలు

#telugu-news #landslide #papua-new-guinea #iom #un-migration-agency
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe