Jet 2 Air ways: షుగర్‌ ఉందని విమానం నుంచి దింపేశారు!

లండన్ లోని జెట్‌ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్‌ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.

Jet 2 Air ways: షుగర్‌ ఉందని విమానం నుంచి దింపేశారు!
New Update

నేడు సమాజంలో ప్రతి పది మందిలో 8 మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది చాలా కామన్‌ అయిపోయింది. కానీ లండన్ లోని జెట్‌ ఎయిర్ వేస్ మాత్రం షుగర్ అనేది చాలా పెద్ద సమస్యలాగా పెద్ద సీన్ క్రియేట్‌ చేసింది. మధుమేహం ఉందని ఏకంగా ఓ ప్రయాణికురాలని విమానం నుంచి బలవంతగంగా కిందకి దింపేశారు విమాన సిబ్బంది.

ఈ సంఘటన గురించి ఆమె జెట్‌ 2 ఇమానయాన సంస్థకు ఫిర్యాదు చేసింది. ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ సంస్థ ఆమెకు క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా ఆమె పర్యటన ఖర్చును కూడా తిరిగి చెల్లించింది. దీని గురించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..యూకేకి చెందిన 56 ఏళ్ల హెలెన్‌ టేలర్‌ అనే మహిళకు డయాబెటిస్‌ ఉంది.

Also read: నచ్చిన వారిని వివాహం చేసుకోవాలంటే.. నవరాత్రుల సమయలో ఇలా చేయండి!

ఈ కారణం చూపించి జెట్ 2 విమానం నుంచి ఆమెను కిందకి దింపేస్తున్నట్లు సిబ్బంది ఆమెకు తెలిపారు. ఆమె, ఆమె భర్త కలిసి విహార యాత్రకు వెళ్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. విమానం ఎక్కిన సమయంలో ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే విమానం ఎక్కిన తరువాత ఆమె కొంచెం నలతగా కనిపించారు.

దాంతో విమాన సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆమె వారితో '' ఇది నాకు మామూలే అని మొదటిసారిగా ఆహారం అప్పుడే తీసుకున్నానని..అందుకే డయాబెటిస్‌ కారణంగా కొంచెం ఇబ్బంది అయ్యిందని సిబ్బందికి వివరించింది. కొంచెం సేపు కూర్చుని నీళ్లు తాగితే సరిపోతుందని ఆమె వివరించిన కూడా విమాన సిబ్బంది వినలేదు.

Also read: జనసేనకు మరో భారీ షాక్‌..ఆ నేత గుడ్‌ బై చెప్పేశాడు!

పది నిమిషాల తరువాత విమాన సిబ్బంది ఆమెను మీ ఆరోగ్య కారణాల రీత్యా విమానంలో నుంచి కిందకి దిగిపోవాలని తెలిపారు. దీన్ని టేలర్‌ వారిని ప్రశ్నించారు. ఆమె దిగడానికి ఒప్పుకోక పోయినా కూడా వారు ఆమెను బలవంతంగా కిందకి దింపేశారు. దీని గురించి ఆమె కెప్టెన్‌ తో కూడా మాట్లాడారు.అయినప్పటికీ కెప్టెన్‌ కూడా ఆమెకు మద్దతివ్వలేదు.

దీని గురించి ఆమె మాట్లాడుతూ.. '' నా లైఫ్‌ లో ఇలాంటి సిల్లీ ఇన్సిడెంట్‌ ను ఎదుర్కొలేదు. మాతో వారు ప్రవర్తించిన తీరును ఇప్పటికీ నేను మరచిపోలేకపోతున్నాను. వారు మా పట్ల చూపించిన తీరు చాలా బాధకరమని ఆమె వాపోయారు. దీని గురించి ఆమె జెట్‌ 2 కి ఫిర్యాదు చేసారు. తాము నష్టపోయిన సొమ్మును వాపసు కోరుతూ ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ముందు విమానయాన సంస్థ ఎలాంటి స్పందన ఇవ్వకపోయినప్పటికీ..ఆ తరువాత ఆమెకి జెట్‌ 2 క్షమాపణలు తెలిపింది.

#diabaties #jet-2 #airways #london
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe