చంద్రయాన్-3తో అగ్రరాజ్యలకు పెరిగిన అసూయ... భారత్ పై విషం గక్కిన బ్రిటన్ ఛానల్....!

భారత్ పై బ్రిటన్ ఛానల్ జీబీ న్యూస్ విషం గక్కింది. చంద్రయాన్-3 విజయాన్ని అభినందిస్తూనే భారత్ కు ఇతర దేశాల సహాయాన్ని తప్పుబట్టింది. విదేశాల నుంచి పొందిన 2.3 ట్రిలియన్ల ఆర్థిక సహాయాన్ని తిరిగి ఇచ్చి వేయాలని తెలిపింది. భారత్ కు చంద్రునిపైకి రాకెట్లు ఎగురవేసే సామర్థ్యం వున్నప్పుడు ఇతర దేశాల సహాయం అడగటం దేనికని ప్రశ్నించింది.

author-image
By G Ramu
New Update
చంద్రయాన్-3తో అగ్రరాజ్యలకు పెరిగిన అసూయ... భారత్ పై విషం గక్కిన బ్రిటన్ ఛానల్....!

UK media targets India After Chandrayaan 3 Success: చంద్రయాన్-3తో భారత్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. అభివృద్ది చెందిన దేశాలకు సైతం అందనంత ఎత్తులో నిలిచింది. దీంతో భారత్ ను చూసి అగ్రరాజ్యాలు అసూయపడుతున్నాయి. భారత్ పై అవాకులు చెవాకులు పేలుతున్నాయి. నిన్న డ్రాగన్ కంట్రీ, నేడు బ్రిటన్.. దేశమేదైనా వాళ్ల ఉద్దేశం ఒకటే కనిపిస్తోంది. సందు దొరికితే చాలు భారత్ పై విషం గక్కుతున్నాయి.

భారత్ పై విషం కక్కిన బ్రిటన్ ఛానెల్...!

తాజాగా చంద్రయాన్-3 సక్సె స్ నేపథ్యంలో భారత్ పై బ్రిటన్ కు చెందిన జీబీ న్యూస్ ఛానల్ (GB News) విషం గక్కింది. చంద్రయాన్-3 విజయాన్ని అభినందిస్తూనే ఆ మిషన్ కు భారత్ విదేశాల నుంచి ఆర్థిక సాయం కోరిందని ఆ ఛానెల్ యాంకర్ ప్యాట్రిక్ క్రిస్టిక్ విషం గక్కారు. విదేశాల నుంచి పొందిన 2.3 బిలియన్ పౌండ్స్ సహాయాన్ని భారత్ తిరిగి ఇచ్చి వేయాలంటూ సూచనలు చేశారు.

అలాంటప్పుడు మా వద్దకు రావద్దు...!

వచ్చే ఏడాది భారత్‌కు బ్రిటన్ అందించాలనుకున్న ప్రతిపాదిత 57 మిలియన్ పౌండ్ల విదేశీ సహాయాన్ని కూడా బ్రిటీష్ పన్ను చెల్లింపుదారు నిలిపివేయాలన్నారు. అంతరిక్ష కార్యక్రమం ఉన్న దేశాలకు మనం డబ్బు ఇవ్వకూడదన్నారు. నిబంధనల ప్రకారం... మీరు చంద్రునిపై చీకటి వైపునకు రాకెట్లను పంపగలిగినప్పుడు భారత్ తమ వద్దకు రావద్దన్నారు.

Also Read: చంద్రయాన్-3 ఫొటో తీసిన చంద్రయాన్-2

భారత ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు మేమేందుకు పన్నులు కట్టాలి....!

భారత్ లో 29 మిలియన్ల ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా పేదలు భారత్ లోనే వున్నారని చెప్పారు. ఇక ఏడాదికి 3.75 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా వుందన్నారు. అక్కడి వారి గురించి అక్కడి ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు తామంత ఎందుకు పన్నులు చెల్లించాలని ప్రశ్నించారు.

భారత నెటిజన్లు ఫైర్....!

ఆ వ్యాఖ్యలపై భారత నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. మీరు భారత్ నుంచి దోచుకు వెళ్లిన 44 ట్రిలియన్ల దోపిడి డబ్బు నుంచి కట్ చేసుకోండని ఒక నెటిజన్ మండిపడ్డారు. మరో నెటిజన్... గ్రాంట్ గురించి గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అన్నారు.నిబంధనల ప్రకారం.. మీరు దోచుకున్న 44 ట్రిలియన్ డాలర్ల డబ్బును తీరిగి ఇచ్చి వేసి భారత్ కు సెల్యూట్ చేయాలన్నారు.

Also Read: అదే జరిగితే చంద్రయాన్ నాశనమైనట్టే….. బాంబు పేల్చిన ఇస్రో చైర్మన్…!

Advertisment
తాజా కథనాలు