UK Elections: బ్రిటీష్ ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం..!

యూకేలో గురువారం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.ఈసారి బ్రిటన్‌ ఎన్నికల ఫలితాలు చరిత్ర తిరగరాసేలా ఉన్నాయి.భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య ఈసారి అత్యధికంగా ఉండొచ్చని తెలుస్తుంది.ఈ సారి యూకే ఎన్నికల్లో భారతీయ సంతతి అభ్యర్థులు 100 మంది వరకు బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు.

UK Elections: బ్రిటీష్ ఎన్నికల్లో భారతీయుల ఆధిపత్యం..!
New Update

UK Elections: యూకేలో గురువారం సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడు, ప్రధాన మంత్రి రిషి సునాక్ పరువు ప్రతిష్ట ప్రమాదంలో పడింది. గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ...ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. బ్రిటన్‌ ఎన్నికల ఫలితాలు చరిత్ర తిరగరాసేలా ఉన్నాయి.

భారతీయ సంతతికి చెందిన ఎంపీల సంఖ్య ఈసారి అత్యధికంగా ఉండొచ్చని తెలుస్తుంది. ఈ సారి యూకే ఎన్నికల్లో భారతీయ సంతతి అభ్యర్థులు సుమారు 100 మంది వరకు బరిలో నిలిచి పోటీ చేస్తున్నారు. బ్రిటీష్‌ పార్లమెంట్‌ లో 65 మంది నల్ల జాతీయులు ఎంపీల్లో భారతీయ సంతతికి చెందిన 15 మంది ఎంపీలు ఉన్నారు.

ఇందులో లేబర్‌ పార్టీకి చెందిన ఎంపీలు ఎనిమిది మంది , ఏడుగురు కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన వారు ఉన్నారు. బ్రిటీష్‌ రాజకీయ చరిత్రలో 15 మంది భారతీయ ఎంపీల సంఖ్య కచ్చితంగా అత్యధికం, అయితే ఈసారి ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఎలక్షన్స్‌ లో 100 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు పోటీ లో నిలిచారు. 2022 లో మొదటి నల్లజాతీయుడైన రిషి సునక్‌ బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

Also read: స్వదేశానికి చేరుకున్న విశ్వ విజేతలు!

#elections #rishi-sunak #uk
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe