Breaking : సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు!

ఉజ్జయిని మహాకాల్‌ ఆలయంలో భస్మ హారతి ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు

Breaking : సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు!
New Update

Fire Accident : ఉజ్జయిని మహాకాల్‌(Ujjaini Mahankali Temple) ఆలయంలో భస్మ హారతి(Bhasma Aarti) ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌(CM Mohan) కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారు గర్భగుడికి కొంత దూరంలో ఉండడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో డజను మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వాస్తవానికి, హోలీ పండుగ(Holi Festival) కారణంగా, ఆలయంలో గులాల్ విసురుకోవడం జరిగింది. , దాని కారణంగా మంటలు వ్యాపించాయని ఆలయాధికారులు వెల్లడించారు.

ఈ మంటల కారణంగా 12 మంది పూజారులకు, పూజారి సేవకులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఉజ్జయిని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సీఎం మోహన్ కుమారుడు, కుమార్తె కూడా
ఈ ప్రమాదంలో సీఎం మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె తృటిలో తప్పించుకోవడం విశేషం. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే వీరు ఉన్నారు.. ఈ ప్రమాదంలో మహాకాల్ దేవాలయంలో భస్మర్తి ప్రధాన పూజారి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, సేవకుడు మహేష్ శర్మ, చింతామన్ గెహ్లాట్ సహా పలువురు గాయపడ్డారు.

ఈ క్రమంలో ఆలయ పూజారి ఆశిష్ శర్మ మాట్లాడుతూ, 'మహాకాల్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. గులాల్ కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయి. ఆలయ పూజారికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు.

Also Read : అక్కడ తొలిసారిగా మహిళా అభ్యర్థిపై బీజేపీ పందెం.. ఎవరీ పల్లవి?

#fire-accident #holi #bhasma-aarti #ujjaini-mahankali-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe