Breaking : సీఎం కుమారుడు, కుమార్తెకి తృటిలో తప్పిన ముప్పు.. గర్భగుడిలో చెలరేగిన మంటలు! ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు By Bhavana 25 Mar 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Fire Accident : ఉజ్జయిని మహాకాల్(Ujjaini Mahankali Temple) ఆలయంలో భస్మ హారతి(Bhasma Aarti) ఇచ్చే సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్(CM Mohan) కుమారుడు, కుమార్తె కూడా ఆలయంలోనే ఉన్నారు. అయితే వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారు గర్భగుడికి కొంత దూరంలో ఉండడంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఆలయంలో భస్మ హారతి ఇస్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సందర్భంగా జరిగిన ఈ ప్రమాదంలో డజను మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వాస్తవానికి, హోలీ పండుగ(Holi Festival) కారణంగా, ఆలయంలో గులాల్ విసురుకోవడం జరిగింది. , దాని కారణంగా మంటలు వ్యాపించాయని ఆలయాధికారులు వెల్లడించారు. ఈ మంటల కారణంగా 12 మంది పూజారులకు, పూజారి సేవకులు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఉజ్జయిని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. #WATCH | Ujjain, Madhya Pradesh | 13 people injured in a fire that broke out in the 'garbhagriha' of Mahakal Temple during bhasma aarti today. Holi celebrations were underway here when the incident occurred. The injured have been admitted to District Hospital. (Earlier visuals… pic.twitter.com/cIUSlRirwo — ANI (@ANI) March 25, 2024 సీఎం మోహన్ కుమారుడు, కుమార్తె కూడా ఈ ప్రమాదంలో సీఎం మోహన్ యాదవ్ కుమారుడు, కుమార్తె తృటిలో తప్పించుకోవడం విశేషం. ఘటనా స్థలానికి కొద్ది దూరంలోనే వీరు ఉన్నారు.. ఈ ప్రమాదంలో మహాకాల్ దేవాలయంలో భస్మర్తి ప్రధాన పూజారి సంజయ్ గురు, వికాస్ పూజారి, మనోజ్ పూజారి, అన్ష్ పురోహిత్, సేవకుడు మహేష్ శర్మ, చింతామన్ గెహ్లాట్ సహా పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఆలయ పూజారి ఆశిష్ శర్మ మాట్లాడుతూ, 'మహాకాల్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలు నిర్వహిస్తున్నారు. గులాల్ కారణంగా గర్భగుడిలో మంటలు వ్యాపించాయి. ఆలయ పూజారికి గాయాలయ్యాయి. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లామని వివరించారు. Your browser does not support the video tag. Also Read : అక్కడ తొలిసారిగా మహిళా అభ్యర్థిపై బీజేపీ పందెం.. ఎవరీ పల్లవి? #fire-accident #holi #bhasma-aarti #ujjaini-mahankali-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి