మాల్దీవుల్లో పార్లమెంట్ సభ్యులు ఒకరినొకరు కొట్టుకోవడం కలకలం రేపింది. ప్రతిపక్ష ఎంపీలు స్పీకర్‌ను అడ్డుకోవడంతో పార్లమెంట్ సభ్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మయిజు నేతృత్వంలో కేబినెట్ ఆమోదానికి ఆదివారం పార్లమెంట్‌లో కీలక సమావేశం నిర్వహించారు. అయితే కొంతమంది నామినేటెడ్ మంత్రుల ఎంపికపై.. విపక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు.
Also Read: ఇండియా కూటమి కథ ముగిసింది.. జేపీ నడ్డా సంచలన వ్యాఖ్యలు
పార్లమెంట్‌లో మెజార్టీగా ఉన్న మాల్దీవియన్ డెమొక్రాటిక్ పార్టీ (MDP) ఎంపీ సభ్యులు నలుగురు కేబినెట్ మంత్రుల ఎంపికను వ్యతిరేకించారు. వాళ్ల ఎన్నిక ఆమోదం కోసం జరిగిన ఓటింగ్‌పై అభ్యంతరం తెలిపారు. దీంతో పార్లమెంట్‌లో జరుగుతున్న సమావేశాన్ని కొనసాగేంచకుండా స్పీకర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు.
విపక్ష సభ్యులు స్పీకర్ ఛాంబర్‌లోకి ప్రవేశించి గందరగోళం సృష్టించారు. దీంతో అధికార ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ (పీపీఎం), పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ (పీఎన్‌సీ)కు చెందిన సంకీర్ణ ప్రభుత్వం సభ్యులు.. విపక్ష సభ్యులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో సభ్యులు ఒకరినొకరు పోట్లాడుకోవడంతో.. పార్లమెంట్‌లో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటీజన్లు విభిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.
Also Read: బీహార్‌లో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం..ఏ అవకాశాన్ని వదలబోమన్న ప్రధాని మోదీ..!!