Women: చదువు, ఉద్యోగాల కోసం సిటీలకు వచ్చే మహిళలకు గుడ్‌ న్యూస్..

గ్రామీణ ప్రాంతాల నుంచి టైర్-1, మెట్రో నగరాలకు చదువు, ఉద్యోగం కోసం వెళ్లే మహిళలకు కేంద్రం 'సఖి నివాస్' పేరిట వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో వసతి, భోజన సదుపాయంతో పాటు పిల్లలకు డే కేర్ లాంటి సౌకర్యాలు ఉంటాయి. ఫీజు కూడా నామమాత్రంగా ఉంటుంది.

New Update
Women: చదువు, ఉద్యోగాల కోసం సిటీలకు వచ్చే మహిళలకు గుడ్‌ న్యూస్..

చదువు, ఉద్యోగాల కోసం చాలా మంది పల్లె నుంచి పట్నం బాట పడుతుంటారు. కానీ అక్కడికి వెళ్లాక గది అద్దెకు తీసుకోవడం లేదా హాస్టల్స్‌లో ఉండటం లాంటివి చేస్తుంటారు. ప్రతినెల ఇందుకోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుంది. చదవుకునే విద్యార్థులకు వాళ్ల తల్లిదండ్రులు ఇంటి నుంచి కొంత డబ్బులు పంపాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగం చేసేవాళ్లకి అయితే శాలరీలో కొంతభాగం అద్దెలకే పోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఓ ప్రత్యేక స్కీమ్‌ను తీసుకొచ్చింది.

Also Read: నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్‌ మాట తప్పింది.. కేటీఆర్‌ ఆగ్రహం!

ఖర్చంతా వాళ్లదే

టైర్-1, మెట్రో నగరాలకు వెళ్లే గ్రామీణ మహిళలకు మిషన్ శక్తి పథకంలోని భాగంగా.. 'సఖి నివాస్' అనే పేరిట వర్కింగ్ ఉమెన్‌ హాస్టళ్లను ఏర్పాటు చేసేలా ముందుకొచ్చింది. ఈ హాస్టళ్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేయనుంది. వీటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చంతా కూడా ఈ శాఖనే భరించనుంది. అయితే ఈ వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లకు యూనివర్సిటీలు మాత్రమే ఆశ్రమం కల్పించనున్నాయి.

తక్కువ ఫీజు

అయితే వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల కోసం యూనివర్సిటీలు స్థలం కేటాయించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ సూచనలు చేసింది. యూనివర్సిటీలు స్థలం కేటాయిస్తే.. హాస్టళ్ల నిర్మాణం, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చును మహిళా శిశు సంక్షేమ శాఖ భరిస్తుంది. ఇందులో వసతి, భోజనం, అలాగే పిల్లలకోసం డే కేర్‌ సదుపాయలను కూడా అందించనున్నారు. అంతేకాదు ఈ హాస్టళ్ల రెంటు కూడా నామమాత్రంగానే ఉండనుంది.

Also Read: సీఎం జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

గ్రామీణ ప్రాంతాల నుంచి చదువు, ఉద్యోగాల కోసం టైర్-1, మెట్రో నగరాలకు వెళ్లే మహిళలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుక సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) కార్యదర్శి మనీశ్ జోషి .. వర్సిటీల వీసీలు, కాలేజీలు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లకు ఆయన లేఖ రాశారు. రాబోయే 10 రోజుల్లో తమ పరిధిలోని 10 నుంచి 15 స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

Advertisment
తాజా కథనాలు