Delhi: దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది..కోట్లలో ఊబర్ బిల్లు ఊబర్ బిల్లు చూసి గుండె ఆగినంత పనైంది ఓ కస్టమర్‌కు. అయితే ఇదెక్కడో వేరే దేశంలో అనుకుంటున్నారా...అబ్బే అస్సలు కాదు సాక్షాత్తు ఇది మన దేశ రాజధాని ఢిల్లీలోనే జరిగింది. జస్ట్ 7.66 కోట్లు పే చేయాలని బిల్లు చూపించింది అంతే. By Manogna alamuru 31 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Uber Cab Bill: ఈ మధ్య కాలంలో క్యాబ్ సర్వీసులు చాలా ఎక్కువ అయ్యాయి. చాలా మంది వీటిని విరివిగా వాడుకుంటున్నారు. ఓలా, ఊబర్, ర్యాపిడో..ఇలా ఇంకా చాలా సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దాదాపు అందరి ఫోన్లలో వీటి తాలూకా యాప్‌లు ఉంటూనే ఉంటాయి. కార్లు లేని వారే కాదు సమయానుకూలంగా అందరూ ఈ క్యాబ్ సర్వీసులను వాడుకుంటున్నారు. డ్రైవింగ్ చేయలేని వారు, నచ్చని వాళ్ళు, దూరాలు వెళ్ళాల్సిన వాళ్ళకు ఈ క్యాబ్ రైడ్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. అయితే వీటితో చాలా సార్లు చిరాకు కూడా ఉంటుంది. ఒక్కోసారి మనకు కావాల్సిన సమయానికి బుక్ అవ్వవు. బుక్ అయినా చాలా ఎక్కువ రేట్లు చూపిస్తాయి. ప్రైమ్ టైమ్‌లో అయితే ఇంక చెప్పనే అక్కర్లేదు. అదే కాదు ఒక్కో సారి బుక్ చేస్తున్నాప్పుడు ఒక బిల్ చూపిస్తూ రైడ్ పూర్తయ్యాక మరొక బిల్లు చూపిస్తాయి. ఇలాంటి తలనొప్పులు వీటితో చాలానే ఉన్నాయి. ఢిల్లీలోని నోయిడాలో దీపక్ తెంగురియా అనే వ్యక్తికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను రొటీన్‌గా వెళ్ళే రూట్లోనే ఊబర్ బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునేటప్పుడు బిల్లు 62రూ. చూపించింది. అది కూడా ఊబర్ ఆటో బుక్ చేసుకున్నారు దీపక్. తక్కువ అమౌంటే కదా అని ఆటో ఎక్కి రైడ్ కంప్లీట్ కూడా చేసేసుకున్నారు. తీరా దిగాక ఆటో డ్రైవర్ చూపించిన బిల్లుకు కళ్ళకు తిరిగి పడిపోయారు. ఎందుకంటే రైడ్ అయ్యాక వచ్చిన బిల్లు అక్షరాలా 7.66 కోట్లు. దీంతో దీపక్ అవాక్కయిపోయారు. కాసేపటి వరకు అందులో నుంచి బటయకు రాలేకపోయారు. తరువాత మాత్రం దాన్ని వీడియో తీసి ఎక్స్‌లో షేర్ చేశారు. అంతేకాదు తన ఫ్రెండ్‌తో కలిసి జోక్స్ కూడా వేసుకున్నారు దీపక్. చంద్రయాన్‌కు వెళ్ళినా ఇంత బిల్లు రాదంటూ స్నేహితులు ఇద్దరూ నవ్వుకున్నారు. सुबह-सुबह @Uber_India ने @TenguriyaDeepak को इतना अमीर बना दिया कि Uber की फ्रैंचाइजी लेने की सोच रहा है अगला. मस्त बात है कि अभी ट्रिप कैंसल भी नहीं हुई है. 62 रुपये में ऑटो बुक करके तुरंत बनें करोडपति कर्ज़दार. pic.twitter.com/UgbHVcg60t — Ashish Mishra (@ktakshish) March 29, 2024 అయితే దీపక్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్‌కు ఊబర్ రెస్పాండ్ అయింది. అంత బిల్లు చూపించినందుకు క్షమాపణలు చెప్పింది ఊబర్ యాజమాన్యం. తమకు కొంత సమయమిస్తే దాన్ని అప్డేట్ చేస్తామంటూ సందేశం పంపింది. Also Read:Movies: టిల్లుగాడు వంద దాటేసేలా ఉన్నాడు… #delhi #uber #cab-services #7-66-crores మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి