AP: పోలీసుల నిర్లక్ష్యంపై హోంశాఖ సీరియస్.. ఇద్దరు అధికారులు సస్పెండ్..!

నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌ సస్పెండ్ అయ్యారు. నంద్యాల జిల్లా సీతారామపురం వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడి హత్య కేసుపై పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడంతో హోంశాఖ సీరియస్ అయింది.

New Update
AP: పోలీసుల నిర్లక్ష్యంపై హోంశాఖ సీరియస్.. ఇద్దరు అధికారులు సస్పెండ్..!

Nandyal: నంద్యాల జిల్లాలో పోలీసుల నిర్లక్ష్యంపై హోంశాఖ సీరియస్ అయింది. సీతారామపురంలో వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు హత్య కేసుపై పోలీసులు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో బాధ్యులైన పోలీసులపై వేటు పడింది. నంద్యాల రూరల్ సీఐ శివకుమార్ రెడ్డి, మహానంది ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌ ను అధికారులు సస్పెండ్ చేశారు. మరికొంత మంది కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

Also Read: వామ్మో.. డిప్యూటీ సీఎం పవన్ ఇలాకాలో కిలాడి లేడీలు.. పట్టపగలే దర్జాగా..

ముచ్చుమర్రి బాలిక రేప్‌-హత్య ఘటనలోనూ పోలీసులు నిర్లక్ష్యం వహించడంతో నందికొట్కూరు రూరల్ సీఐ, ముచ్చుమర్రి ఎస్సైపై హోంశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా, వైసీపీ కార్యకర్తతో హత్యతో మరోసారి పోలీసులపై వేటు పడింది. వైసీపీ కార్యకర్త సుబ్బరాయుడు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి 30 మంది ఇంట్లోకి చొరబడి సుబ్బరాయుడిని బయటకు లాక్కొచ్చి దాడి చేశారు.


Also Read: ఏపీలో యూట్యూబ్ అకాడెమీ.. సీఈవోతో చంద్రబాబు చర్చలు..!

అంతేకాకుండా కత్తులతో పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు. అడ్డుకున్న కుటుంబ సభ్యులపైనా కూడా దాడి చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే హత్యకు కారణమంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మావి ప్రాణాలు కావా, మమ్మల్ని చంపితే ఎలా అని.. పోలీసులు నిర్లక్ష్యంగా మాట్లాడారని బాధితులు చెప్పారు. ఘటనపై విచారణ చేపట్టడంతో
పోలీసులపై ప్రభుత్వం వేటు వేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు