పోలింగ్ బూత్‌లో విషాదం.. లైన్ లోనే కుప్పకూలిన ఓటర్లు

ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరు వృద్ధులు అస్వస్థతకు గురై చనిపోయిన సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. మావలకు చెందిన తోకల గంగమ్మకు (78) బూత్‌లోనే ఫిట్స్ రాగా. భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) కళ్లు తిరిగి పడిపోయాడు. వారిద్దరూ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

పోలింగ్ బూత్‌లో విషాదం.. లైన్ లోనే కుప్పకూలిన ఓటర్లు
New Update

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేల విషాదం చోటుచేసుకుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా సెంటర్ కు వచ్చిన ఇద్దరు వృద్ధులు మరణించిన సంఘటన అదిలాబాద్ జిల్లాలో జరిగింది. అక్కడున్న ప్రజలు, సిబ్బంది వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

ఇక వివరాల్లోకి వెళితే.. మావలకు చెందిన తోకల గంగమ్మ (78) ఈ రోజు ఉదయం తన ఓటు వేసేందుకు బూత్‌కు వచ్చింది. అయితే ఆమె బ్యాలెట్ బాక్స్ దగ్గరకు చేరుకునే క్రమంలో ఫిట్స్ వచ్చింది. దీంతో గంగమ్మను అక్కడున్న సిబ్బంది దగ్గరలోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గంగమ్మ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదేవిధంగా భుక్తాపూర్‌కు చెందిన రాజన్న (65) ఓటు వేయడానికి వచ్చి వరుసలో నిలబడ్డాడు. అంతలోనే కళ్లు తిరిగి పడిపోవడంతో అతన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో రాజన్న చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Also read :అర్బన్ ఓటర్ల నిర్లక్ష్యంపై వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

ఇదిలావుంటే.. పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగి గుండెపోటుతో మృతి ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామం పోలింగ్‌ బూత్‌ నెంబర్ 248లో జరిగింది. కొండాపూర్ వెటర్నరీ విభాగంలో సహాయకుడిగా పని చేస్తున్న సుధాకర్.. ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడే గత రాత్రి గుండెపోటుకు గురయ్యాడు. దీంతో తోటి సిబ్బంది సీపీఆర్ చేసి వెంటనే సమీపంలోని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సుధాకర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న సుధాకర్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతిచెందడం అతని కుటుంబ సభ్యుల్లో విషాదాన్ని నింపింది. పోలింగ్‌ విధుల్లో పాల్గొన్న ఉద్యోగి మరణించడంతో మిగతా సిబ్బంది కన్నీటి పర్యంతం అయ్యారు.

#adilabad #polling-booth #people-died
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe