Contaminated Water : కలుషిత నీరు తాగి అస్వస్థత.. ముగ్గురు మృతి..!

విజయవాడ - మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరు మృతిచెందగా.. మరో 24 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. దీంతో నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఏంసీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

New Update
Contaminated Water : కలుషిత నీరు తాగి అస్వస్థత.. ముగ్గురు మృతి..!

Vijayawada : విజయవాడ - మొగల్రాజపురంలో కలుషిత నీరుతాగి (Contaminated Water) వందమంది వరకూ అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు మృతి చెందగా.. మరో 24 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిపాలయ్యారు. బస్తీవాసులు డయేరియాతో బాధపతుడున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.

Also Read : ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప 2 సాంగ్..!

దీంతో నీటి సరఫరా (Water Supply) లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు వీఏంసీ ఉద్యోగులను (VMC Employees) సస్పెండ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్ని రోజులు పైపు లైన్ల ద్వారా వచ్చే నీటిని తాగొద్దని.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే, నీళ్లు కలుషితం కాలేదంటున్నారు DM & HO సుహాసిని. ముగ్గురివీ సహజ మరణాలేనని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు