Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే 30 కి పైగా రైళ్లను రద్దు చేసిన అధికారులు..తాజాగా మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ను కూడా అధికారులు రద్దు చేశారు.
విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. ట్రాక్ లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్ లు తెగిపోవడంతో రైళ్లు నిలిపివేశారు. ఆదివారం, సోమవారం కలిపి మొత్తంగా 80 రైళ్లు రద్దు చేయగా, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్-విజయవాడ రూట్ లోనే అత్యధిక రైళ్లు రద్దయ్యాయి. మరో వైపు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను!