యూపీలో మరో అమానుష ఘటన..దొంగతనం నెపంతో మూత్రం తాగించి!

గత కొద్ది కాలంగా దేశ వ్యాప్తంగా అమానవీయ ఘటనలు అనేకం జరుగుతున్నాయి. కొంత కాలం క్రితం మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి పై మూత్రం పోసిన ఘటన మరువక ముందే ...యూపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ పౌల్ట్రీ ఫాంలో డబ్బులు, చికెన్‌ దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మైనర్‌ బాలురిని చిత్ర హింసలకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

New Update

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇద్దరు మైనర్‌ బాలురు ఓ పౌల్ట్రీ ఫాంలో పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వారి మీద దొంగతనం నేరం మోపుతూ కొందరు వ్యక్తులు పైశాచికంగా ప్రవర్తించారు. పిల్లలు ఇద్దరినీ కింద పడేసి, చేతులు వెనక్కి కట్టి తీవ్రంగా కొట్టారు. ఒక బాటిల్‌ లో మూత్రం నింపి, వారి చేత బలవంతంగా తాగించారు.

అంతటితో ఆగకుండా పచ్చి మిరపకాయలు, ఉప్పు వంటివి తినిపించి రాక్షస ఆనందం పొందారు. అది చాలదన్నట్లు బాలురు ప్రైవేట్‌ భాగాల్లోకి మిరపకాయలను చొప్పించి కారం పూసి మృగాల్లా వ్యవహరించారు. పిల్లల శరీరంలోకి పెట్రోల్‌ ఇంజెక్ట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సిద్దార్ధ్‌నగర్‌ జిల్లా పత్రాబజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకొన్నది.

నిందితులు చేసిన ఈ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసులు ఎనిమిది మంది పై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.

పిల్లల ఇద్దరి వయసు కూడా 10 నుంచి 14 మధ్య ఉన్నట్లు తెలుస్తుంది. మూత్రం తాగేందుకు నిరాకరిస్తే...చంపేస్తామని బెదిరించి బలవంతంగా తాగించారు. అనంతరం బట్టలు విప్పించి, మలద్వారంలో మిరపకాయలు చొప్పించారు. పిల్లలు ఆర్తనాదాలు చేస్తున్నా కనికరించలేదు.

రాక్షసానందం పొందుతూ చిత్రహింసలు పెట్టినట్టు వీడియోల్లో ఉన్నది. బాధితుల్లో ఒకరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు