Transfers: ఏపీలో ఇద్దరు కీలక అధికారుల బదిలీ.

author-image
By V.J Reddy
New Update
Transfers: ఏపీలో ఇద్దరు కీలక అధికారుల బదిలీ.

AP: రాష్ట్రంలో ఇద్దరు కీలక అధికారులపై బదిలీ వేటు పడింది. ఫైబర్‌నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి, గనుల శాఖ ఎండి వీజీ వెంకటరెడ్డి ని GAD కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా ఇసుక,గనుల అక్రమ తవ్వకాల్లో వెంకట రెడ్డి పై గతంలో అనేక ఆరోపణలు చేసింది టీడీపీ. ఆయా శాఖల బాధ్యతలను పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కు అప్పగించారు. మరోవైపు నారా లోకేష్‌పై ఫైబర్ నెట్ అక్రమాలపై కేసు నమోదులో మధుసూదన్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో అధికారులపై బదిలీ వేటు వేస్తోంది.

ఇద్దరు ఐపీఎస్ అధికారులపై...

ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. సీఐడి చీఫ్ సంజయ్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ కొల్లి రఘురామి రెడ్డి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్. చంద్రబాబు అరెస్టు సమయంలో సిట్ చీఫ్ గా రఘురామిరెడ్డి వ్యవహరించారు. సంజయ్ ను జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రఘురామిరెడ్డిని డీజీపీ కి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇద్దరు అధికారులు బాధ్యతలను డీజీపీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisment
తాజా కథనాలు