Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!? పసిగుడ్డులకు పాలలో విషం కలిపి చంపి దంపతులు పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అనిల్, దేవిలు తమ పిల్లలైన లోహిత (3), జశ్విత (1)ను దారుణంగా హతమార్చి ఇళ్లు వదిలిపారిపోయారు. తాత వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 10 Mar 2024 in క్రైం వరంగల్ New Update షేర్ చేయండి Crime : మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) లో దారుణం జరిగింది. ఇద్దరు పసిగుడ్డులు అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇంటికి వచ్చేసరికి పిల్లలిద్దరూ విగతజీవులుగా పడి వుండటం చూసి చలించిపోయిన తాత.. తల్లిదండ్రుల(Parents) కోసం వెతకగా ఎక్కడ కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకొచ్చింది. లోహిత (3), జశ్విత (1).. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బయ్యారం మండలం నామాలపాడులో అనిల్, దేవి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే గతవారం అనిల్ తమ స్వగ్రామం అంకన్నగూడెంకు కుటుంబంతో కలిసి వచ్చాడు. అతడి తండ్రి వెంకన్న స్థానికంగా కిరాణా దుకాణం(General Store) నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున షాపుకు వెళ్లిన వెంకన్న.. తిరిగి 10 గంటలకు ఇంటికి వచ్చాడు. అయితే అప్పటికే ఇంట్లో చిన్నారులు లోహిత (3), జశ్విత (1) అనుమానాస్పదరీతిలో మృతిచెందడం చూసి ఆందోళన చెందాడు. కుమారుడు, కోడలు కోసం వెతకగా ఎక్కడా కనిపించలేదు. వెంటనే సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి : Tollywood: మన హీరోయిన్స్ ఒకదానికి కమిట్ అయితే.. రెండు మూడు చేయాల్సిందే.. పాలలో విషం.. పిల్లల డెడ్ బాడీలను పరిశీలించిన వైద్యులు వారు తాగే పాలలో విషం(Poisoning The Milk) కలిపి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పిలల్లకు విషం ఇచ్చి చంపి తల్లిదండ్రులు అనిల్, దేవి పరాపోయినట్లు తెలుస్తోందని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు. #two-children-died #poisoning-the-milk #mahabubabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి