Shadnagar : రంగారెడ్డి జిల్లా (Rangareddy District) షాద్‌నగర్ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులో భారీ పేలుడు (Blast) సంభవించిన సంగతి తెలిసిందే. సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (South Glass Private Ltd. Company) లో కంప్రెషర్ పేలడంతో ఐదుగురు మృతి చెందగా.. 15 మంది కార్మికులు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ పేలుడు ఘటనలో ఓ ట్విస్ట్ జరిగింది. నిన్న ప్రమానికి గురైనా వారిలో ముగ్గురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు. ఘటనాస్థలిలో శరీర భాగాలు దొరకలేదు. ఆ ముగ్గురు మిస్సింగ్ అయ్యారా..? ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోతుగా పోలీసుల దర్యాప్తు :
ఫ్యాక్టరీలో రెండు యూనిట్లు, రెండు షిఫ్ట్‌ల్లో కార్మికులు పనిచేస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓ షిఫ్ట్ పూర్తయ్యే సమయంలోఈ ప్రమాదం జరిగింది. ఈ కంపెనీలో ఒడిశా, బీహార్, యూపీ చెందిన కార్మికులు పని చేస్తున్నారు. మృతులంతా ఈ రాష్ట్రాలకు చెందిన వాసులే. ఇతర రాష్ట్రాల నుంచి పొట్ట కూటి కోసం వచ్చిన కార్మికులు చనిపోవడంతో బాధిత కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద స్థల దృశ్యాలు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించాయి. ప్రమాద సమయంలో కంపెనీలో 150 మంది కార్మికులు పని చేస్తున్నారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందన్న దానిపై విధుల్లో ఉన్న మేనేజర్, సెక్షన్ ఇంఛార్జ్ మేనేజర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గాయపడిన వారికి మెరుగై చికిత్స అందించాలని ఆదేశించారు. బాధితులపై కేసు నమోదు చేసిన షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి ఆరా తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: గర్భధారణ సమయంలో X- కిరణాలు పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి!