Tirupati murders: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!!

తిరుపతిలో జంట హత్యలు కలకలం రేపుతోంది. ఈ ఘటన కపిలతీర్థం సమీపంలోని ఓ ప్రైవేట్ హోటట్‌లో చోటుచేసుకుంది. బావ పదునైన ఆయుధంతో అన్న, చెల్లెల్లను పొడిచి హత్య చేశాడు. మృతులను మహారాష్ట్ర నాందేడ్‌కు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

Tirupati murders: తిరుపతిలో డబుల్ మర్డర్ కలకలం.. అన్నా చెల్లెళ్లను చంపి ఏం చేశాడంటే..!!
New Update

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన యువరాజ్‌కు 12 ఏళ్ల క్రితం మనీషాను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి షక్షమ్(6), ప్రజ్ఞాన్ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. బావమరిది హర్షవర్ధన్‌తో కలిసి యువరాజ్‌, మనీషా నాలుగు రోజుల క్రితం తిరుపతికు వచ్చారు. వీరంతా గురువారం( ఆక్టోబర్‌ 5)న మధ్యాహ్నం 3.30 గంటలకు తిరుపతి నందిసర్కిల్‌ ఉన్న ఓ ప్రవేట్ హోటల్‌ (Pravet Hotel)లో దిగారు. అయితే.. ఇంతలోకే ఏం జరిగింతో తెలియదు కానీ.. శుక్రవారం తెల్లవారుజామున ఈ డబుల్ మర్డర్ వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తిరుపతి ఈస్ట్సు డీఎస్పీ సురేందర్‌రెడ్డి (Tirupati Eastsu DSP Surender Reddy) సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.

వివాహేతర సంబంధంతో..

తిరుమల (Tirupati) శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోవటానికి యువరాజు కుటుంబం వచ్చినట్లు సమాచారం. తిరుపతిలోని ఓ హోటల్ (hotel)లో బస చేసే సమయంలో హోటల్ రూమ్‌లో ఉండగా వారి మధ్య ఘర్షణ మొదలైయింది. దీంతో విచక్షణ మర్చిపోయిన యువరాజ్ ఇద్దరినీ హత్య చేశాడు. భార్య, బామ్మర్ధి (wife and brother-in-law) లను చంపిన అనంతరం యువరాజు అలిపిరి పీఎస్‌ (Alipiri PS)లో లొంగిపోయాడు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవానికి వచ్చిన అన్నా చెల్లెళ్లను యువరాజ్‌ చేతిలో హత్యకు గురి కావటం తిరుపతిలో కలకలం రేపుతోంది. అయితే తిరుపతి ఈ డబుల్ మర్డర్ (Twin murders)  కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు యువరాజ్ భార్య మనీషాకు యువరాజ్‌ సోదరుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానం.

This browser does not support the video element.

అర్థరాత్రి 2 గంటల సమయంలో

ఈ క్రమంలోనే ఏడాదికాలంగా మనీషా, యువరాజ్‌ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే.. రాజీ కుదుర్చేందుకు బావమరిది హర్షవర్ధన్, మనీషాతో పాటు ఇద్దరు పిల్లల్ని యువరాజ్‌ తిరుపతికు రప్పించాడు. గురువారం మధ్యాహ్నం నంది సర్కిల్‌లో ప్రవేట్ హోటల్ 302 రూమ్‌లో దిగారు వీరిని.. అర్థరాత్రి 2 గంటల సమయంలో యువరాజ్‌ హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అలిపిరి పోలీసులు (Alipiri Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. ఈ హత్యలకు గల కారణం ఏమిటీ..? గతంలో విభేధాలు ఏమైనా ఉన్నాయా..? లేదా క్షణికావేశంలో జరిగిందా..?అనే కోణాల్లో పోలీసులు (Police investigation) విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌కు జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీ ఎన్నికల జోష్

#hotel-in-tirupati #wife-and-brother-in-law #yuvraj-killed #twin-murders #tirupati
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe