CBSE Exams : 2024-25 నుంచి సీబీఎస్ఈలో ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్ సీబీఎస్ఈ ఎగ్జామ్స్ విధానంలో మార్పులుచేసింది కేంద్రం. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి పది, పన్నెండు తరగతుల వారికి ఏడాదికి రెండుసార్లు బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయని తెలిపింది. 2024-25 ఏడాది 10, 12th విద్యార్ధులే ఈ విధానంలో మొదటి బ్యాచ్ అవుతారని చెప్పింది. By Manogna alamuru 20 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి CBSE Exams : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Central Board Of Secondary Education) పరీక్షల విధానంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే విద్యా సంవత్సరం అంటే 2024-25 నుంచి ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇలా రెండుసార్లు రాయాలా లేదా ఎప్పటిలా ఒకేసారి రాయాలా అనే దాని మీద విద్యార్ధుల ఇష్టమని చెప్పింది. వాళ్ళు ఏ ఛాయిస్ ఎంచుకున్నా పర్వాలేదని... రెండు సార్లు తప్పనిసరిగా రాయాలన్న నిర్భంధమేమీ లేదని స్పష్టం చేసింది. ఒకవేళ రెండు సార్లు పరీక్షలు రాస్తే వేటిలో ఎక్కువ మార్కులు వచ్చాయో అవే ఫైనల్ రిజల్ట్ కింద అనౌన్స్ చేస్తామని తెలిపింది. Also Read : అయోధ్య రామయ్య దర్శనం చేసుకోవాలంటే ఇవి తప్పక తెలుసుకోవాలి.. ఒత్తిడి తగ్గించేందుకే... విద్యార్ధుల్లో(Students) పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకే ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. ఏడాదికి ఒక్కసారే పరీక్ష రాసే అవకాశం ఉంటే ఎక్కడ తప్పుతామోననే భయం పిల్లల్లో ఉంటోందని... దాని వలన పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారని... అందుకే ఈ విధానాన్ని ఎంచుకున్నామని తెలిపారు. దాంతో పాటూ రెండు సార్లు పరీక్షలు రాయడం వలన విద్యార్ధులు పూర్తిస్థాయిలో ప్రిపేర్ అయ్యే ఛాన్స్ఉంటుంది. దానివలన వారికి స్కోర్ కూడా ఎక్కువ వస్తుంది. అదే మొదటిసారిలోనే మంచి మార్కులు వస్తే రెండో సారి రాయక్కర్లేదు కూడా. దీనివలన ఏడాది మొత్తం ఒత్తిడి కూడా ఉండదు అని చెబుతున్నారు. స్పోర్ట్స్ ఈవెంట్స్, ఒలింపియాడ్ విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్షలు సీబీఎస్‌ఈ(CBSE) పది, 12 తరగతుల పరీక్షలు రాయలేని జాతీయ, అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్, అంతర్జాతీయ ఒలింపియాడ్‌లలో పాల్గొనే విద్యార్థుల కోసం సీబీఎస్ఈ బోర్డు ప్రత్యేక పరీక్షలను నిర్వహించాలని కూడా కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం రాత పరీక్షలకు మాత్రమే వర్తిస్తుంది. కంపార్ట్‌మెంట్, ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా పరీక్షలను మాత్రం అందరితో కలిపే రాయాల్సి ఉంటుంది. క్రీడలు, ఎడ్యుకేషన్ పోటీల్లో పాల్గొనేలా యువతను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖా అధికారి ఒకరు చెప్పారు. #students #cbse #exams #twice-a-year మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి