Turkey: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Turkey: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!
New Update

టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టర్కీ పార్లమెంట్‌ సమీపంలోకి కారులో వచ్చిన ఉగ్రవాది పార్లమెంట్‌ సమీపంలో కారులను పార్కింగ్‌ చేసి పార్లమెంట్‌ గేట్‌ వద్దకు వేగంగా పరిగెత్తాడు. దీంతో అక్కడ ఉన్నబద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో టెర్రరిస్ట్‌తో పాటు పోలీసులు మృతి చెందారు.

ఆత్మాహుతి దాడి జరుగుతున్న సమయంలో అసలు భద్రతా సిబ్బందికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో వారు ఎదురుగా ఎవరు ఉన్నారనేది చూడకుండా కాల్పులు జరిపారు. వారు కాల్పులు జరిపే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా దేశ రాజధాని టర్కీలో ఇంకా ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉందని ఆ దేశ ఆధికారులు అంటున్నారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

అక్కడ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఉగ్రదాడి జరగడం అనేది పెద్ద చర్చకు దారి తీసింది. ఆ దేశ అధ్యక్షుడ్ని టార్గెట్‌ చేసుకొని ఉగ్రవాదాలు ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది అంకారాలో అనుమానాస్పదంగా కన్పిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

#video #suicide #attack #ankara #turkey-parliament #near
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe