TTD: టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్‌ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

New Update
TTD: టీటీడీ కీలక నిర్ణయం

కలియుగ వైకుంఠ దైవం కొలువై ఉన్న తిరుమలలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు సడలిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. నేటి నుండి ద్విచక్ర వాహనాలను ఘాట్‌ రోడ్డులో అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. గతంలోలా యథావిధిగా రాత్రి 10 గంటల వరకూ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. వన్య మృగాల కదలికలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది. కాగా గతంలో చిరుత పులులు అర్థరాత్రి సమయంలో కాలి నడకన కొండపైకి వస్తున్న భక్తులపై దాడికి దిగాయి.

అదే సమయంలో ద్యిచక్ర వాహనాలపై వస్తున్న భక్తులపై సైతం దాడికి దిగబోయాయి. దీంతో సాయంత్రం సమయంలో ఘాట్‌ రోడ్డులో ద్విచక్ర వాహనాలకు అనమతి ఇవ్వడంలేదని టీటీడీ తెలిపింది. ఇక భక్తులపై దాడి చేస్తున్న వన్య మృగాలను పట్టుకునేందుకు ఆపరేషన్ చిరుతను ప్రారంభించిన టీటీడీ.. ఇప్పటి వరకు 6 చిరుతలను బంధించింది. దీంతో చిరుతల కదలికలు కొండ పరిసర ప్రాంతాల్లో తగ్గాయని గుర్తించిన టీటీడీ అధికారులు.. యథావిధిగా బైక్‌లను అనుమతిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తుల స్వామివారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది.గురువారం స్వామివారిని 54,620 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 2.98 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. వరుస సెలవులు రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఒక్కసారిగా పొటెత్తినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు