TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం

తిరుమల శ్రీవారి దర్శనార్థం నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు అలిపిరి మెట్ల దగ్గర చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. చిరుత దాడుల నేపథ్యంలో భక్తులకు కర్రల పంపిణీని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భక్తులతో సంభాషించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

TTD: తిరుమల కాలినడక భక్తులకు చేతికర్రల పంపిణీ ప్రారంభం
New Update

TTD: తిరుమల శ్రీవారి దర్శనార్థం నడకమార్గంలో వెళ్తున్న భక్తులకు అలిపిరి మెట్ల దగ్గర చేతి కర్రల పంపిణీ ప్రారంభమైంది. చిరుత దాడుల నేపథ్యంలో భక్తులకు కర్రల పంపిణీని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం భక్తులతో సంభాషించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ కావాలనుకున్న భక్తులకే కర్రలు ఇస్తామని.. భక్తుల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వన్యప్రాణుల దాడుల నేపథ్యంలో భక్తుల్లో ఆత్మవిశ్వాసం నింపడం కోసమే కర్రలు ఇస్తున్నామన్నారు. కాలినడక భక్తులకు టీటీడీ ఎప్పుడూ అండగానే ఉంటుందని పేర్కొన్నారు. అలిపిరి దగ్గర నుంచి కర్రలను నరసింహ స్వామి ఆలయం దగ్గర తిరిగి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులకు విధించిన ఆంక్షలు అలాగే కొనసాగుతాయని స్పష్టంచేశారు.

publive-image

అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలకు అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. రాత్రి పది గంటల వరకు పెద్దలకు నడక మార్గంలో అనుమతి ఇస్తున్నారు. అలాగే నడక మార్గంలో వెళ్లే ప్రతి భక్తుడికి ఊతకర్ర ఇస్తామని గతంలో కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి నుండి ఘాట్ రోడ్డులో వెళ్లే ద్విచక్ర వాహనదారులకు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే అనుమతి ఇస్తామన్నారు. నడకమార్గంలో వెళ్లే పిల్లల చేతికి పోలీసులు ఇప్పటికే ట్యాగ్‌లు వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే సులభంగా కనిపెట్టేందుకు ఈ ట్యాగ్‌పై పిల్లల పేర్లు, ఫోన్ నెంబరు, తల్లిదండ్రుల వివరాలు, పోలీస్ విభాగం టోల్ ఫ్రీ నెంబరు ముద్రిస్తున్నారు.

భూమన అధ్యక్షతన మంగళవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. రామకోటి తరహాలో గోవింద కోటి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ గోవింద కోటి రాసేందుకు 25 సంవత్సరాల వయస్సు లోపు యువతీయువకులకు అవకాశం ఇస్తున్నట్లు భూమన తెలిపారు. సనాతన ధర్మ వ్యాప్తి విస్తృతంగా జరగాలని, సంస్కృతి పరిరక్షణ చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. నవీనతరంలో భక్తిభావనను పెంపొందించుకునేందుకు గోవింద కోటి కార్యక్రమం తీసుకొస్తున్నామని చైర్మన్ వివరించారు. గోవింద కోటి రాసిన వారి కుటుంబానికి ఒక్కసారి విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తాం అని పేర్కొన్నారు. అతి త్వరలోనే కేజీ నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థి కూడా సులభంగా చదివేలా 20 పేజీల భగవద్గీత పుస్తకాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ప్రతి భక్తుడికి ఊతకర్ర.. తిరుమలలో నడక భక్తులకు కొత్త రూల్స్

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe