TGSPDCL: ఇకనుంచి కరెంటు బిల్లు ఇలా చెల్లించండి.. పూర్తి వివరాలు

ఆర్బీఐ నిబంధనల మేరకు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL).. ఫోన్‌ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్లులు చెల్లించడాన్ని నిషేధించింది.ఇప్పుడు TGSPDCL అధికారి వెబ్‌సైట్ లేదా యాప్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించాలో ఈ ఆర్టికల్‌లో వివరాలు తెలుసుకోండి.

TGSPDCL: ఇకనుంచి కరెంటు బిల్లు ఇలా చెల్లించండి.. పూర్తి వివరాలు
New Update

కరెంటు బిల్లు కట్టేందుకు ఇదివరకు చాలామంది ఫోన్‌ పే, గూగుల్ పే ను వియోగించేవారు. కానీ ఆర్బీఐ నిబంధనల మేరకు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా కరెంటు బిల్లులను నిలిపివేసింది. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తెలంగాణలో విద్యుత్ పంపిణీని నిర్వహిస్తున్న తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఈ నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌లో గానీ, యాప్ ద్వారా గానీ విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు. అయితే దీన్ని చెల్లించాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి
ముందుగా TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌ https://tgsouthernpower.org/ వెళ్లండి.
అక్కడ హోమ్ పేజీలో Consumer Services లో ఆన్‌లైన్ సర్వీసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్‌కు కుడివైపున ఉనన 'Pay Your Bill' మీద క్లిక్ చేయండి
ఆ తర్వాత క్రింద ఇచ్చిన ప్లేసులో మీ యూనిక్ నంబర్‌ను ఎంటర్ చేయండి
ఇప్పుడు మీ కరెంట్‌ బిల్లును చూపించే మరొక పేజీ వస్తుంది. అక్కడ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోండి
మీ వివరాలు ఎంటర్ చేశాక మీ ఫోన్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి, బిల్లు పే చేయొచ్చు
బిల్లు కట్టిన తర్వాత E-రసీదును పొందవచ్చు. దానిని సేవ్ చేసుకోవాలి.

బిల్ డెస్క్ ద్వారా TGSPDCL ఎలక్ట్రిసిటీ బిల్లును ఎలా చెల్లించాలంటే..
TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి
అక్కడ 'పే యువర్ బిల్'పై క్లిక్ చేయండి.
తర్వాతి పేజీలో, 'బిల్ డెస్క్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
ఇప్పుడు యూనిక్ సర్వీస్ నంబర్, ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయండి.
'మేక్ పేమెంట్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
బిల్లు మొత్తం తర్వాతి స్క్రీన్‌లో కనిపిస్తుంది. అక్కడ బిల్లు చెల్లించండి

TGSPDCL మొబైల్ యాప్‌తో ఇలా చెల్లించండి
ముందుగా TGSPDCL యాప్ ఓపెన్ చేయండి
కరెంట్ బిల్ కట్టేందుకు మీ యూనిక్ సర్వీసు నంబర్‌తో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు అప్లికేషన్ స్క్రీన్ నుంచి 'పే యువర్ పవర్ బిల్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి
మీ బిల్లు మొత్తాన్ని పొందేందుకు అప్లికేషన్‌పై మీ యూనిక్ సర్వీసు నంబర్, ఫోన్ నంబర్‌ ఎంటర్ చేయండి
పేమెంట్ ఆప్షన్‌లతో పాటు మీరు చెల్లించాల్సిన బిల్లు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు లేదా UPI యాప్‌లతో ఏదో ఒక దానితో పేమెంట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత E-రసీదు వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు.

విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్‌లైన్‌లో చేయాలంటే..
ఇక విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్ లైన్‌లో చేయాలనుకునే.. సమీపంలో ఉన్న TSSPDCL కార్యాలయం లేదా కలెక్షన్ సెంటర్‌కు వెళ్లి అక్కడ చెల్లించవచ్చు. లేకపోతే దగ్గర్లోని మీ సేవా లేదా ఈ-సేవా కేంద్రాల ద్వారా నుంచి కూడా బిల్లు చెల్లించవచ్చు.

#telugu-news #current-bill #tgspdcl
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe