Power Cuts in Hyderabad: హైదరాబాద్ వాసులకు విద్యుత్ అధికారులు (Electricity Officers) భారీ షాక్ ఇచ్చారు. నేటి నుంచి నగరంలో కరెంట్ కోతలు అమల్లోకి వస్తున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాల మరమ్మత్తు , వార్షిక నిర్వహణలో భాగంగా ఈ కోతలను విధిస్తున్నట్లు తెలిపారు.ఈ విద్యుత్ కోతలు ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నందుకు చింతిస్తున్నట్లు టీఎస్‌ఎస్‌ఏపీడీసీఎల్ (TSSPDCL) ఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
జనవరి 17 బుధవారం నుంచి ఫిబ్రవరి 10 వరకు కూడా ఈ కరెంట్ కోతలు ఉంటాయని తెలిపారు. వచ్చే వేసవి కాలం/ రబీ సీజన్స్ లో అధికంగా విద్యుత్ డిమాండ్ ఉండడంతో దానికి సిద్దం కావడం కోసం వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల పాటు విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఫరూఖీ (Musharraf Ali Faruqui) తెలిపారు.
వైర్లకు అడ్డు రాకుండా తొలగిస్తూ...
విద్యుత్ నిర్వహణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్ల పై పెరిగిన చెట్ల కొమ్మలను వైర్లకు అడ్డు రాకుండా తొలగిస్తూ విద్యుత్ లైన్లను పరిశీలించి అవసరం అనుకున్న చోట కొత్తవి ఏర్పాటు చేస్తామని ముషారఫ్ తెలిపారు. నగరంలో కరెంట్ కోతలు ఉంటాయి కానీ..రోజూ కాదని ఒక్కో ఫీడర్ కు ఒక రోజు మాత్రమేనని ఫరూఖీ వివరించారు.
జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో దాదాపు 3 వేల బేసి ఫీడర్లు ఉన్నాయని జనవరి 17 నుంచి ఫిబ్రవరి 10 ఆదివారాలు, పండుగల సమయంలో తప్ప మిగిలిన అన్ని రోజుల్లో కూడా సుమారు 15 నిమిషాల నుంచి 2 గంటల పాటు విద్యుత్ ను నిలిపివేసి నిర్వహణ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు.
విద్యుత్ నిర్వహణ జరిగే ప్రాంతాల్లోనే కరెంట్ కోతలు ఉంటాయని అధికారులు వివరించారు. విద్యుత్ కోతలకు సంబంధించిన వివరాలను
http://tssouthernpower.com వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచుతామని తెలిపారు. ఇదిలా ఉంటే..అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ కోతలు తప్పవని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ విమర్శించిన విషయం తెలిసిందే.
Also read: పార్కింగ్ విషయంలో గొడవ..నలుగురి హత్య..పోలీసుల అదుపులో ఆరుగురు!