Sajjanar: అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు.. బిగ్‌బాస్ ఫ్యాన్స్‌కు ఇచ్చిపడేసిన సజ్జనార్! తెలుగు బిగ్‌బాస్-7 విన్నర్‌ను ప్రకటించిన తర్వాత TSRTCకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. 6 బస్సుల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని ట్వీట్ చేశారు. By Trinath 18 Dec 2023 in సినిమా తెలంగాణ New Update షేర్ చేయండి అభిమానులు చేసే అతి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. సినీ హీరోల ఫ్యాన్స్ అనేక సందర్భాల్లో హద్దులు దాటుతుంటారు. సినిమా రిలీజ్‌కు ముందు కుక్కలను కూడా బలిచ్చే క్రూరులు ఉంటారు. అయితే ఈ పిచ్చి అభిమానం కేవలం సినిమా హీరోలకు మాత్రం పరిమితం కాదు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు ఉండే అభిమానులు సైతం చాలా సందర్భాల్లో ఓవర్ చేసిన ఘటనలు అనేకం చూశాం. తాజాగా బిగ్‌బాస్-7 ముగిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ విన్నర్‌గా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అయితే తెలుగు బిగ్‌బాస్-7 ఫైనల్(Bigg Boss-7 Final) జరుగుతున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియో బయట ఫ్యాన్స్ ఓవరాక్షన్ చేశారు. ఫైనల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత లిమిట్ క్రాస్ చేశారు. దీనిపై తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 టెన్షన్ టెన్షన్: బిగ్ బాస్ హౌస్ దగ్గర అర్థరాత్రి హైటెన్షన్ నెలకొంది. బిగ్‌బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ జరిగింది. అమర్‌దీప్ కారుతో పాటు బస్సు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. ఫ్యాన్స్ అల్లర్లతో బిగ్‌బాస్ హౌస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి స్పెషల్ ఫోర్సెస్ దగాల్సి వచ్చింది. పరిస్థితి అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. బిగ్‌బాస్ హౌస్ దగ్గర నుంచి ఫ్యాన్స్‌ను పోలీసులు తరిమికొట్టారు. బిగ్‌బాస్ హౌస్ దగ్గర హింస ఈ స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. అటు ఈ గొడవ ఇక్కడితో ఆగలేదు. హైదరాబాద్ కృష్ణనగర్‌లోని బస్సు అద్దాలను ధ్వంసం చేసే వరకు సాగింది. ఆదివారం రాత్రి TSRTCకి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సజ్జనార్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. 'అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.' అని సజ్జనార్ ట్వీట్ చేశారు. Also Read: విజేత పల్లవి ప్రశాంత్ పై.. MLA హరీష్ రావు ఆసక్తికర ట్వీట్.! WATCH: #tsrtc #pallavi-prasanth #bigg-boss-7 #v-c-sajjanar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి