Bigg Boss 7 Winner: విజేత పల్లవి ప్రశాంత్ పై.. MLA హరీష్ రావు ఆసక్తికర ట్వీట్.!

బిగ్ బాస్ చరిత్రలో మొదటి సారి కామన్ మ్యాన్ టైటిల్ గెలిచి రికార్డ్ క్రియేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. తాజాగా పల్లవి ప్రశాంత్ గెలుపును అభినందిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట్ MLA హరీష్ రావు ట్వీట్ చేశారు. సిద్దిపేట్ కు చెందిన రైతు బిడ్డ టైటిల్ గెలవడం ఆనందంగా ఉందంటూ తెలిపారు.

New Update
Bigg Boss 7 Winner: విజేత పల్లవి ప్రశాంత్ పై.. MLA హరీష్ రావు ఆసక్తికర ట్వీట్.!

Bigg Boss 7 Winner: బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో నిన్నటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తో ముగిసింది. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా ప్రకటించారు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్.. టైటిల్ గెలిచి బిగ్ బాస్ చరిత్రలో సంచలనం సృష్టించాడు. రైతు బిడ్డగా వెళ్లిన ప్రశాంత్ టైటిల్ గెలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు పూర్తయిన 6 సీజన్స్ లో సెలెబ్రెటీలే టైటిల్ గెలిచారు. మొదటి సారి ఒక కామన్ మ్యాన్ టైటిల్ గెలిచి బిగ్ బాస్ హిస్టరీ లో రికార్డు సృష్టించాడు.

publive-image

తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపును అభినందిస్తూ మాజీ మంత్రి సిద్దిపేట్ MLA హరీష్ రావు ట్వీట్ చేశారు. "బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా నిలిచినందుకు.. సిద్దిపేట్ రైతు బిడ్డ ప్రశాంత్ కు అభినందనలు అని తెలిపారు". పల్లవి ప్రశాంత్.. అనే ఈ పేరు రైతుకు ఇంటి పేరుగా మారింది. నీ సంకల్పం సామాన్యులకు ప్రతీకగా నిలిచింది. పొలం నుంచి బిగ్ బాస్ వరకు వెళ్లిన నీ జర్నీ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది అంటూ తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం MLA హరీష్ రావు చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: Bigg Boss 7 Winner Pallavi Prashanth: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్‌ బాస్‌ చరిత్రలో నెవర్‌ బిఫోర్‌..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు