Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా రెండు వైరల్ వీడియోలను తన ట్విట్టర్ (X) ఖాతాలో షేర్ చేశారు. ఫేమస్ కావాలన్న ఆలోచనతో రోడ్ల మీద పిచ్చి వేశాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ వీడియోల ద్వారా ఆయన యువతకు సూచించారు.

New Update
Viral Video: ఇలా చేస్తే ప్రాణాలు పోతాయ్.. షాకింగ్ వీడియోలు షేర్ చేసిన సజ్జనార్ ఐపీఎస్

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (RTC MD Sajjanar) సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తన సోషల్ మీడియాలో సంస్థకు సంబంధించిన సమాచారంతో పాటు.. ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం రోడ్లపై ఫీట్లు చేసి ప్రమాదాలకు గురైన వారి వీడియోలను (Viral Accident Videos) ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్. అలాంటివి చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచిస్తుంటారు. తాజాగా ఆయన ఇలాంటి మరో వీడియోను షేర్ చేశారు. ఓ యువకుడు వేగంగా వెళ్తున్న బైక్ హ్యాండిల్ ను వదిలేసి దానిపై నిల్చొని ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు వీడియోకు ఫోజు ఇస్తుండగా.. అతను అదుపుతప్పి ఓ పక్కకు కింద పడిపోయాడు. బైక్ మరో పక్కకు దూసుకెళ్లడంతో అటువైపు ఎదురు వస్తున్న మరో బైక్ కు తాకింది. దీంతో ఆ బైక్ పై ఉన్న ఇద్దరూ కూడా కింద పడిపోయారు.
ఇది కూడా చదవండి: Vizag Beach: విశాఖ తీరానికి పురాతన పెట్టె ..అది ఎప్పటిది అంటే!

ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్ 'తలకెక్కిన వెర్రి ఇది!' అంటూ కామెంట్ చేశారు. గతంలోనూ ఇలాంటి ఓ వీడియోను షేర్ చేశారు. ఓ వ్యక్తి వేగంగా వెళ్తున్న కార్ లో నుంచి సగం బయటకు వచ్చి ఏదో సహసం చేసినట్లు ఫోజు కొట్టబోయి కిందపడ్డారు. ఆ వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. 'సోషల్ మీడియా పిచ్చి పాడుకాను!.. సోషల్ మీడియా జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Biryani: బిర్యానీలో కాళ్ళ జెర్రీ.. ఉలిక్కిపడ్డ కస్టమర్..!

ఓవర్ నైట్ లో సెలబ్రిటీలం కావాలనే తపనతో ప్రాణాలకు తెగించి ఇలా చిత్ర విచిత్రాలు చేస్తున్నారు. ఈ పిచ్చి పనులతో పాపులర్ మాట అటుంచితే.. ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.' అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ.. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు, ముఖ్యంగా యువతకు సూచనలిస్తున్న సజ్జనార్ ను అభినందిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు