TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం రూ.13,600 లతో ఈ ట్రిప్‌ కి వెళ్లి రావొచ్చని వారు తెలిపారు.

New Update
TSRTC: శబరిమల వెళ్లే భక్తులకు శుభవార్త.. టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు!

TSRTC Special Buses for Sabarimala: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రం నుంచి స్వామి దర్శనం కోసం శబరిమలకు వెళ్లే వారి కోసం టీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ బస్సులను రాష్ట్రంలో జనవరి 5 నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.అయ్యప్ప స్వాములు, భక్తులు అంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, రైళ్లకు టికెట్లు దొరకలేదని ఆందోళన పడాల్సిన అవసరం లేదని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులను నడిపేందుకు సమయం, టికెట్‌ ధరలను కేటాయించినట్లు అధికారులు ప్రకటించారు.

శబరిమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ సిబ్బంది ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటారని ఆర్టీసీ యజమాన్యం తెలిపింది. ఇటీవల శబరిమలలో జరిగిన , అయ్యప్ప భక్తులు పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని టీఎస్‌ ఆర్టీసీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ నుంచి శబరిమల (Hyderabad to sabarimala) వెళ్లే ప్రతీ ప్రయాణికుని వద్ద నుంచి రూ. 13,600 చొప్పున వసూలు చేయనున్నారు. ఇందులో అల్పాహారం,మధ్యాహ్నం , రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది.

ఎంజీబీఎస్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు..
ఈ బస్సులు జనవరి 5 శుక్రవారం నాడు లహరి బస్సు ఎంజీబీఎస్‌ (MGBS) నుంచి బయల్దేరుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ బస్సు బయల్దేరుతుంది. శనివారం నాడు రాత్రి ఈ బస్సు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ నుంచి అదే రోజు రాత్రి 10.30 గంటలకు తిరిగి బయల్దేరుతుంది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు గురువాయూర్‌ చేరుకుంటారు. తిరిగి 12.30 గంటలకు బస్సు కదులుతుంది. సోమవారం ఉదయం 9.20 గంటకు పంబ చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి బయల్దేరుతుంది. అదేరోజు రాత్రి 11.20 గంటలకు ఎరుమేలి చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం 8.10 గంటలకు బయల్దేరుతుంది.

మంగళవారం తిరువనంతపురానికి..
మంగళవారం ఉదయం తిరిగి అక్కడ నుంచి తిరువనంతపురం చేరుకుంటారు. మళ్లీ రాత్రి 9.20 కు బస్సు ప్రారంభం అవుతుంది.అదే రోజు సాయంత్రం మదురైకి చేరుకుంటారు. తిరిగి 11.30 కు అక్కడ నుంచి బయల్దేరుతుంది.బుధవారం ఉదయం 7.30 గంటలకు అరుణాచలం వెళ్లి అక్కడి నుంచి 3.30 గంటలకు తిరిగి బయల్దేరతారు. బుధవారం సాయంత్రం 6.10 గంటలకు కంచి చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున అక్కడి నుంచి బస్సు మొదలవుతుంది. గురువారం ఉదయం మహానంది చేరుకుంటారు. రాత్రి అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుంది. అక్కడి నుంచి నేరుగా ఎంజీబీఎస్‌కు చేరుకుంటామని ఆర్టీసీ తెలిపింది.

Also read: బీచ్‌ ఒడ్డున మార్నింగ్‌ వాక్‌..సముద్రంలో స్నార్కెలింగ్‌..ప్రకృతిని ఆస్వాదిస్తున్న మోదీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు