Good News For TS RTC : వేసవి కాలం(Summer Season) లో దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ(TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ ఛార్జీలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటనలో తెలిపారు. వారం రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని సజ్జనార్ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించాలని సూచించారు. ఈ రాయితీని వినియోగించుకోవాలని సజ్జనార్(VC Sajjanar) ప్రయాణికులను కోరారు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తెలంగాణ ఆర్టీసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతున్నట్లు వివరించింది. ఇందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయని సంస్థ ఎండీ సజ్జనార్ వివరించారు. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని సజ్జనార్ వెల్లడించారు. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందన్నారు.
బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయణంపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోంది. హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ రూట్లలో వెళ్లే ప్రయాణికులు ఈ 10 శాతం రాయితీని వినియోగించుకోవచ్చు.
Also read: దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!