Elections: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC

తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది.

New Update
Hyderabad:ఆర్టీసీ బస్సులో మహిళ ఆగమాగం..కండక్టర్ ను కాలితో తన్నిన వైనం

TSRTC Special Buses For Elections: తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ ప్రాంతాలకు టీఎస్‌ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఏపీకి ప్రకటించిన బస్సుల్లో సీట్లన్ని రిజర్వ్ అయిపోయాయి. దీంతో TSRTC గురువారం అదనంగా మరో 160 సర్వీసులను ఆన్‌లైన్‌లో పెట్టింది. తెలంగాణ జిల్లాలకు వెయ్యికి పైగా బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేస్తోంది టీఎస్‌ఆర్టీసీ సంస్థ. ఇందుకోసం ఈనెల 10,11,12 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడిపించనుంది. ఈ మూడు రోజుల కోసం తెలంగాణ జిల్లాలకు 1400 సర్వీసుల్ని సిద్ధం చేస్తోంది.

Also Read: రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు.. మోదీపై రాహుల్ గాంధీ ఫైర్

హైదరాబాద్‌లోని MGBS, JBS లతో సహా.. ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయలుదేరేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ తదితర జిల్లాలకు డిమాండ్లకు అనుగుణంగా బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. TSRTC.. హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు రోజూ 300 బస్సులు నడిపిస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులన్ని రిజర్వేషన్లతో ఫిల్ అయిపోయాయి.

దీంతో మే 10న 120 ప్రత్యేక బస్సులు, 11న 150, 12న 130 ప్రత్యేక బస్సులు నడుపనుంది. ఈ బస్సులను అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, పోలవరం, కందుకూరు, విశాఖ, కనిగిరి, ఉదయగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడిపిస్తున్నారు.13, 14 తేదీల్లో తిరుగు ప్రయాణంలో ఏపీ నుంచి వచ్చేందుకు కూడా ఆర్టీసీ బస్సులను సిద్ధం చేస్తోంది. మరోవైపు 22 రైళ్లలో కూడా అదనపు బోగీలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది.

Also read: మరో నాలుగు రోజులు వానలే వానలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు