TS to TG: ఇక నుంచి TS ప్లేస్‌లో TG..అమల్లోకి రవాణాశాఖ ఉత్తర్వులు!

తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్‌‌ మార్క్‌ను టీఎస్‌ నుంచి టీజీగా వాడనున్నారు. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ తాజాగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మార్పు కొత్త వాహనాలకు వర్తింపజేస్తారు.

TS to TG: ఇక నుంచి TS ప్లేస్‌లో TG..అమల్లోకి రవాణాశాఖ ఉత్తర్వులు!
New Update

TS to TG Number Plates : 'టీఎస్'(TS) స్థానంలో తెలంగాణ(Telangana) లో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల(Vehicle No. Plates) కోసం 'టీజీ'(TG) ప్రిఫిక్స్‌ను కేంద్రం ఆమోదించినట్లు రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఢిల్లీ(Delhi) లోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రిజిస్ట్రేషన్ ప్లేట్‌లపై కొత్త ప్రిఫిక్స్ తక్షణమే అమలులోకి వస్తుంది.

మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్‌ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించారు. ఆమేరకు రాష్ట్ర మంత్రివర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇకనుంచి రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీజీగా మారనుంది.

తెలంగాణ ఒక పదమే.. కానీ..:
ఈ మార్పు కొత్త వాహనాలకు వర్తింపజేస్తారు. TS నంబర్ ప్లేట్‌లతో కూడిన వాహనాలు కొనసాగుతాయి. రోడ్లపైకి వచ్చే కొత్త వాహనాలు రాష్ట్రంలో 'టీజీ' ప్రిఫిక్స్‌తో రిజిస్టర్డ్ నంబర్ ప్లేట్‌లను కలిగి ఉంటాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే అప్పటి టీఆర్‌ఎస్(TRS) ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని టీఎస్‌గా మార్చాలని కోరింది. తెలంగాణ అనేది ఒక్క పదమే అయినా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానిని టీజీగా మార్చాలని కోరుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌ ప్లేట్లపై టీఎస్‌ నుంచి టీజీకి మార్చేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్‌ మల్లు రవి స్పష్టం చేశారు.

Also Read : మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్.. ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్!

#telangana #revanth-reddy #ts-to-tg
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe