TS TET Results : తెలంగాణ (Telangana) లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు (TET Results) బుధవారం విడుదల అవుతున్నాయి. ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన (Sri Deva Sena) ప్రకటించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల 3న టెట్ ప్రాథమిక కీని విడుదల చేశారు.
అయితే మార్కుల కేటాయింపును సాధారణ పద్దితిలో చేశారా? లేక నార్మలైజేషన్ విధానంలోనా అనే విషయం గురించి మాత్రం అధికారులు వెల్లడించలేదు. ఫలితాలను ఎన్నిగంటలకు విడుదల చేస్తారు అనే విషయం గురించి కూడా అధికారులు క్లారిటీ ఇవ్వలేదు.
బుధవారం విడుదలయ్యే టెట్ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ (DSC) రాసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో డీఎస్సీ దరఖాస్తు గడువును ఈ నెల 20 వ తేదీ వరకు పొడిగించింది. డీఎస్సీకి ఇప్పటి వరకు దాదాపు 2.35 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.