Breaking : టెట్ దరఖాస్తుల గడువు పెంపు తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. నిజానికి ఇంతకు ముందు ఉత్తర్వుల ప్రకారం ఈరోజుతో టెట్ దరఖాస్తుల గడువు ముగియాలి. అయితే ఇప్పుడు దాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. By Manogna alamuru 10 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి TET Application : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్(TS TET) దరఖాస్తుల గడువు తేదీని పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈరోజుతో ముగియనున్న గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. దాంతో పాటూ ఈ నెల 11 నుంచి 20 వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. ఇప్పటివరకు అప్లై చేయపని అభ్యర్ధులు ఈ గడువు పొడిగింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యశాఖ సూచించింది. మరోవైపు హాల్ టికెట్ల జారీ తేదీని కూడా మార్చనుంది విద్యశాఖ. ఈ డేట్ ఏప్రిల్ 15 ఉండగా దాన్ని వాయిదా వేయనుంది. సీబీటీ విధానంలో పరీక్షలు.. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సీబీటీ(CBT) విధానంలో విద్యాశాఖ టెట్ పరీక్షలను నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో టెట్ పరీక్ష(TET Exam) ను నిర్వహించనున్నారు. ఇప్పటివరకు దీని కోసం 1,95,135 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ చెబుతోంది. అయితే గతంతో పోలిస్తే ఈ సారి బాగా తగ్గాయని అంటోంది. ఈరోజు మరికొంత మంది అప్లే చేసుకున్నా ఈ సంఖ్య రెండు లక్షలు దాటకపోవచ్చని తెలిపింది. DSC కి ముందు టెట్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 3 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ది చేకూరనుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి డీఎస్సీ కి ముందు టెట్ పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఓ కమిటీని వేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తరువాత డీఎస్సీ కన్నా ముందే టెట్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులుగా పని చేయాలనుకునేవారికి టెట్ కావాలి. టెట్ అర్హత ఉన్నవారికే రిక్రూట్ మెంట్ పరీక్ష టీఆర్టీ రాసే అవకావం ఉంటుంది. పేపర్ 1 పరీక్షకు డీఈడీ అర్హతతో పాటూ ఇంటర్‌లో జనరల్ అభ్యర్ధులకైతే 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. 2015లోపు డీఈడీ పూర్తి చేసిన వారు జనరల్ అభ్యర్దులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, 40 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్ష ఫీజు కింద ఒక్కో పేపర్‌కు వెయ్యి ఫీజు చెల్లించాలి. జూన్ 12న టెట్ ఫలితాలు(TET Results) విడుదల అవుతాయి. Also Read : Andhra Pradesh: వైసీపీలోకి కీలక నేతలు..జగన్ సమక్షంలో చేరికలు #telangana #ts-tet-2024 #appilcation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి