Soyam Bapu Rao Joined Congress Party: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలవాలన్న లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ (TS Congress) ఆ మేరకు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీలో (Telangana BJP) అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో (Rathod Bapurao) చర్చలు జరిపింది హస్తం పార్టీ. చర్చలు ఫలించడంతో ఆయన ఈ రోజు బీజేపీకి గుడ్ బై చెప్పి.. కాంగ్రెస్ లో చేరిపోయారు. 2023 వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావు, టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇది కూడా చదవండి: Apoori Somanna: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఏపూరి సోమన్న!
అక్కడ కూడా టికెట్ రాకపోవడంతో వెనువెంటనే బీజేపీలో చేరి పోటీ చేశారు. 53,992 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు తిరిగి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు బాపురావు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి సీతక్క ఈ చేరికలో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు సోయం బాపూరావు.పార్టీలో ఇన్నాళ్లు తనకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు.