TS Politics 2023: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి?

బీజేపీకి డీకే అరుణ, విజయశాంతి కూడా గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. వారిద్దరు కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. గద్వాల నుంచి పోటీ చేస్తే తాను గెలిచే అవకాశం లేదని డీకే అరుణ భావిస్తున్నట్లు సమాచారం. విజయశాంతి కూడా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

TS Politics 2023: బీజేపీకి మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి డీకే అరుణ, విజయశాంతి?
New Update

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) రాజీనామా నుంచి ఇంకా తేరుకోకముందే.. బీజేపీకి (BJP) మరో గట్టి షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో ఇద్దరు కీలక నేతలు డీకే అరుణ, విజయశాంతి (Vijayashanthi) ఆ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీ (BJP) నుంచి పోటీ చేస్తే గద్వాలలో తన గెలుపు కష్టమని డీకే అరుణ (DK Aruna) భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఫస్ట్‌ లిస్ట్‌ తర్వాత పార్టీ తీరుపై డీకే అరుణ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. మరో నేత విజయశాంతి కూడా పార్టీలో జరిగే పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సరైన గుర్తింపు రావడం లేదని ఆమె ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె కొన్ని రోజులుగా వరుస ట్వీట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: TS Congress: ఈ రాత్రికే కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కానీ ఓ బిగ్ ట్విస్ట్?

ఇదిలా ఉంటే.. గద్వాల సీటును సరిత తిరుపతయ్యకు ఇప్పటికే కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ మేరకు ఫస్ట్ లిస్ట్ లోనే ఆమె పేరు కూడా ప్రకటించింది. అయితే.. ఇప్పుడు డీకే అరుణ చేరితే సరిత తిరుపతయ్య పరిస్థితి ఏంటన్న చర్చ గద్వాల నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: TS Congress: ఎల్లుండే కాంగ్రెస్ లోకి రాజగోపాల్ రెడ్డి.. పోటీ ఎక్కడి నుంచంటే?

దీంతో డీకే అరుణకు వేరే సీటును కేటాయిస్తారా? లేదా గద్వాల అభ్యర్థిని మారుస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకటి లేదా రెండు రోజుల్లో కాంగ్రెస్ లో డీకే అరుణ చేరిక.. ఆమె పోటీ చేసే నియోజకవర్గంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయశాంతి మాత్రం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.|

#telangana-elections-2023 #congress #dk-aruna #telangan-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి