Gruha Jyothi Scheme : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్(Free Current) అందించే గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) అమలును ఈ నెల నుంచే ప్రారంభించింది రేవంత్ సర్కార్(Revanth Sarkar). ప్రజాపాలన(Praja Palana) కార్యక్రమంలో దరఖాస్తు చేసుకుని.. 200 యూనిట్లలోపు విద్యుత్ ను వినియోగించుకున్న లబ్ధిదారులకు జీరో బిల్స్ ను అందించారు ఎలక్ట్రిక్ సిబ్బంది. కొందరికి అర్హత ఉన్నా కూడా జీరో బిల్ రాకపోవడంతో వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే.. వారికి కూడా స్కీం అమలు అవుతుందని.. టెన్షన్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హత ఉండి జీరో బిల్(Zero Bill) రాని వారు తమ కరెంట్ బిల్, ఆధార్ కార్డు జిరాక్స్, ప్రజా పాలన దరఖాస్తు నంబర్, రేషన్ కార్డుతో ఎంపీడీఓ ఆఫీసును సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వివరాలను నమోదు చేసుకోవాలని చెబుతున్నారు. వివరాల నమోదు తర్వాత అధికారులు అందించే రసీదును విద్యుత్ సిబ్బందికి అందించి జీరో బిల్ ను పొందాలని వివరిస్తున్నారు. ఇలా చేసిన వారికి ఈ నెల నుంచి బిల్ జీరో అవుతుందని స్పష్టం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఇందిరమ్మ ఇళ్లకు మార్గదర్శకాలు రెడీ
పట్టణాల్లో ఇలా..
పట్టణాల్లో నివాసం ఉంటూ జీరో కరెంట్ బిల్ పొందని లబ్ధిదారులు స్థానిక మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రెడీ.. లిస్ట్‌లో ఎవరున్నారంటే?
జీరో బిల్ ఎందుకు రాలేదు?
ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న సమయంలో కొందరు తమ రేషన్ కార్డు, ఆధార్, విద్యుత్ సర్వీస్ నంబర్ల వివరాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారికి జీరో బిల్లు రాలేదని చెబుతున్నారు. అయితే.. ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే క్రమంలోనూ తప్పులు దొర్లాయి. డేటా ఎంట్రీ సమయంలో తప్పుగా వివరాలు నమోదు కావడంతో కొందరికి జీరో బిల్లులు నమోదు కాలేదని తెలుస్తోంది.
ఆ రెండు జిల్లాల్లో ఆగిన స్కీం
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మహాలక్ష్మి స్కీమ్ ను ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు. మిగతా అన్ని జిల్లాల్లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. దాదాపు 40 లక్షల మందిని తొలివిడతలో ఈ స్కీమ్ కు అర్హులుగా తేల్చింది రేవంత్ సర్కార్. వచ్చే నెల నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.