TS Elections 2023: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు ఎంతో తెలుసా?

గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తుల వివరాలపై చర్చ జరుగుతోంది. 2014, 2018లో కంటే ఈసారి ఆస్తులు మూడింతలకు పైగా పెరిగినట్లు టాక్.

New Update
TS Elections 2023: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆస్తులు ఎంతో తెలుసా?

MLA Raja Singh: తెలంగాణ ఎన్నికలకు మరో 25రోజులు మాత్రమే ఉండడంతో నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఎన్నికల బరిలో నిలిచేందుకు అన్ని రాజకీయ పార్టీ నేతలు నామినేషన్స్ వేస్తున్నారు. తాజాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాజాసింగ్(Raja Singh) నామినేషన్ వేశారు. ప్రస్తుతం రాజాసింగ్ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయానికి ప్రస్తుతానికి రాజాసింగ్ ఆస్తులు విలువ దాదాపు మూడింతలకు పైగా పెరిగిందని టాక్ వినిపిస్తోంది.

Also Read: ఈ నెల 7న తెలంగాణకు మోదీ

2014లో రాజాసింగ్ ఆస్తుల వివరాలు:

రూ. 1.50 లక్షలు నగదు, 10 గ్రాముల బంగారం, ఆయన భార్య చేతిలో రూ.22,738 నగదు, 250 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు.

2018లో రాజాసింగ్ ఆస్తుల వివరాలు:

తన వద్ద రూ.2 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.60,44,932లతో పాటు 50 గ్రాముల బంగారం ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇక వాహనాలకు విషయానికి వస్తే టాటా సఫారీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైక్, మహీంద్రా బొలేరో వాహనాలు ఉన్నాయని తెలిపారు. రాజాసింగ్ పేరుమీద రూ. 87.52 లక్షల చరాస్తులు, రూ.2.29 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య వద్ద రూ. లక్ష నగదు, అకౌంట్‌లో రూ.4.69 లక్షలున్నాయని, 300 గ్రాముల బంగారంతో పాటు రూ. 14.29 లక్షల చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు.

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది: KTR

2023లో రాజాసింగ్ ఆస్తుల వివరాలు:

తన వద్ద నగదు రూ.2 లక్షలు, భార్య వద్ద రూ. లక్ష ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లతో కలిపి వద్ద రూ. 1.84 కోట్లు ఉన్నట్లు చూపారు. తన వద్ద 250 గ్రాముల బంగారం.. తన భార్య ఉషాబాయ్‌ పేరుపై రూ.3,36,638లు ఉండగా.. 300 గ్రాముల బంగారం ఉందని పేర్కొన్నారు. 2018లో చూపిన వాహనాలతో పాటు కొత్తగా తన భార్య పేరుపై రూ.26 లక్షల విలువ గల హెక్టార్‌ ప్లస్‌ సెవన్‌ సీటర్‌ కారు, రూ.84,335 విలువ గల హోండా యాక్టివా వాహనలు ఉన్నాయని తెలిపారు. ఇక రాజాసింగ్ అప్పుల వివరాలకు వస్తే ఆయన వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులు రూ.13.60 లక్షలు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు